దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శఠగోపం తప్పక తీసుకోవాలి.చాలా మంది దైవ దర్శనం చేసుకున్నాక ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు.
కొద్ది మంది మాత్రమే ఆగి, శఠగోపం పెట్టించుకుంటారు.
శఠగోపం అంటే అత్యంత రహస్యం.
అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరకిను తలుచుకోవాలి.అంటే మీ కోరికే శఠగోపం.
మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం.
నిత్యం మంత్రోచ్ఛారణలతో శక్తివంతమయ్యే స్వామి సన్నిధిలో శఠగోపం ఉంటుంది.
శఠగోపంలో భగవంతుడు నిలిచి ఉంటాడని ప్రతీతి.అటువంటి శక్తివంతమైన, లోహం తో తయారుచేయబడిన శఠగోపం సహస్రార చక్రానికి తాకించడం వలన మనలోని కుండలినీ శక్తి ప్రేరేపించబడుతుంది.
ఈ జన్మ లభించడానికి కారణమైన పుణ్య కార్యాలను, భగవంతుని దర్శనం లో గల మహత్తుని శఠగోపం గుర్తు చేస్తుంది.