తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam ) నిత్యం భక్తుల రద్దీతో ఉంటుంది.కోరి కొలిచేవారికి కొంగుబంగారమై నిలిచే కోనేటి రాముడికి ఎంతో బంగారం ఉంది.
నిత్యం దేశ విదేశాల నుంచి స్వామి వారిని దర్శించుకునే భక్తులు స్వామి వారికి ఎన్నో కానుకలను సమర్పిస్తూ ఉంటారు.బంగారం అయితే లెక్కలేనంత.
స్వామి వారి ఖజానాకు చేరుతుంది.ప్రతి ఏడాది కోట్ల సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తూ ఉంటారు.
వారిలో బంగారు ఆభరణాలు, వజ్రభరణాలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు.చాలా విలువైన అపురూపమైన ఆభరణాలు స్వామివారి ఖజానాలో ఉన్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక అధికారి తెలిపిన వివరాల ప్రకారం స్వామివారి వద్ద టన్నుల కొద్ది బంగారం నిలువలు ఉన్నాయి.

మొత్తం స్వామి వారి వద్ద ఉన్న ఆభరణాలతో కలిపి 11 టన్నుల బంగారం ఉంది.స్వామి వారి పేరు మీద బ్యాంకుల్లో 9,259 కిలోల బంగారం విలువలు ఉన్నాయని అధికారి వెల్లడించారు.అలాగే ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే 5387 కిలోల బంగారం డిపాజిట్లు ఉండగా ఆ తర్వాత 1938 కిలోల బంగారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో డిపాజిట్ చేశారు.
ఇటువంటి తమిళనాడులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1381 కిలోల కేజీల బంగారం డిపాజిట్ చేశారు.ఎన్నికల సమయంలో ఆ బంగారం బయటకు రావడం కూడా పెద్ద వివాదంగా మారింది.ఇక మొత్తంగా స్వామివారి దగ్గర బంగారు ఆభరణాలు 1.2 టన్నులు వెండి 10 టన్నులు ఉన్నట్లు సమాచారం.తిరుమల దేవస్థానం బ్యాంకుల్లో జమ చేస్తున్న బంగారం హుండీలో భక్తుల కానుకలు సమర్పించినవే.అవి రకరకాల బంగారు ఆభరణాలతో పాటు బిస్కెట్ రూపంలోనూ వస్తాయి.

వీటిని తిరుమల తిరుపతి దేవస్థానం బ్యాంకులో డిపాజిట్ చేయడం మొదలుపెట్టింది.అప్పటినుంచి బంగారు డిపాజిట్ల మెచ్యూరిటీపై దేవాలయ నిర్వాహకులు వడ్డీ మతాన్ని కూడా బంగారంగా మార్చారు.అది ఇప్పటికే బ్యాంకుల వద్ద ఉన్న కుప్పలు కుప్పలుడి బంగారు రాసి ఉండడం విశేషం.ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల ప్రకారం 23- 24 వార్షికోత్సవంలో 1031 కిలోల బంగారం డిపాజిట్ అయింది.
దీంతో ఇప్పటివరకు మొత్తం 11,329 కిలోల బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసింది.అలాగే నగదు రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి( Sri Venkateswara Swamy ) పేరు మీద దాదాపు 17వేల కోట్లకు పైనే డిపాజిట్ అయిందని ముఖ్య అధికారులు చెబుతున్నారు.