తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరిలో నితిన్ ఒకరు.ఈయన చేస్తున్న ప్రతి సినిమా కూడా యూత్ లో మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టింది.
ఇక అందులో భాగంగానే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించింది.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుముల( Nitin Venky Kudumula ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి ఇలాంటి క్రమంలో ఆయన ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్ హీరోగా వచ్చిన భీష్మ సినిమా( Bheeshma Movie ) తర్వాత నితిన్ కి సరైన సక్సెస్ లేదు.కాబట్టి మళ్ళీ ఇదే కాంబినేషన్ లో హిట్ పడాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి ఎలివేట్ చేసుకొని సూపర్ సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు.అయితే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ కి చెందిన బాబీ డియోల్( Bobby Deol ) ను తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా దాదాపు 30% షూట్ కంప్లీట్ చేసుకుంది.కాబట్టి ఇప్పుడు ఆయనకు సంబంధించిన రోల్ ను వేయించి అనిమల్ సినిమా( Animal Movie )తో ఆయనకి ఎలాంటి క్రేజ్ అయితే వచ్చిందో ఇప్పుడు ఆ క్రేజ్ ని వీళ్ళు వాడుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…అలాగే వెంకీ కుడుముల కూడా ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన వాడు అవుతాడు…
.