మునగతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

మునక్కాయ( Drumstick ) అంటే ఇష్టపడని వారంటూ ఉండరు.మునక్కాయతో సాంబార్ వండిన కర్రీ వండిన ఇతర రకాలైన మునక్కాయ కూరలు వండిన లొట్టలు వేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తింటారు.

 Health Benefits Of Eating Drumstick,drumstick,drumstick Benefits,health Tips,hea-TeluguStop.com

మునక్కాయలో టేస్ట్ మాత్రమే కాకుండా పోషకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి.విటమిన్ ఏ, బి1, బి2, బి3, బి5, బి6, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

అలాగే మునక్కాయలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కూడా ఉన్నాయి.మునక్కాయ మన డైట్ లో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

మునక్కాయలో క్యాల్షియం, ఐరన్( Iron ), ఫాస్ఫరస్ లాంటి పోషకాలు ఉన్నాయి.

Telugu Drumstick, Benefits, Tips, Kkidney-Telugu Health

అందుకే ఇవి మన ఎముకలను దృఢంగా( bones Health ) ఉంచుతాయి.అలాగే చిన్నారులలో ఎముకల అభివృద్ధికి కూడా తోడ్పడతాయి.ఇక వృద్ధులు కూడా వారి డైట్లో చేర్చుకుంటే ఎముకల సాంద్రత పునర్దిస్తుంది.

ఇక మునగలలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఆర్థరైటిస్ తో చికిత్స చేస్తాయి.ఇందులో విటమిన్స్ ఉండటం వలన రక్షణ కల్పిస్తాయి.

మునక్కాయలోని యాంటీ లక్షణాల వలన ఆస్తమా, దగ్గు, గురక లాంటి శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గిస్తాయి.మునక్కాయ డైట్ లో చేర్చుకోవడం వలన రోగ నిరోధక శక్తి( Immunity boosting ) పెరిగి వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది.

మునక్కాయలోని పోషకాలు జీర్ణవ్యవస్థ సజావుగా పని చేయడానికి సహాయపడుతుంది.మునక్కాయలో ఉన్న టైటిల్ ఫైబర్, పేగు, కదలికలను సులభం చేసి గట్ హెల్త్ కు మేలు చేస్తుంది.

Telugu Drumstick, Benefits, Tips, Kkidney-Telugu Health

ఇక మునక్కాయ తరచూ తినడం వలన కిడ్నీ సమస్యలు( Kidney Problems ), కిడ్నీలో రాళ్లు వచ్చే నొప్పి కూడా తగ్గుతుంది.దీనిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కిడ్నీల నుంచి టాక్సిన్ లను క్లియర్ చేస్తాయి.అలాగే కిడ్నీల పై ఒత్తిడి, కిడ్నీ లలో రాళ్ళు పూర్తిగా తగ్గించి, వాటి పనితీరు మెరుగుపరుస్తాయి.మునక్కాయలోని విటమిన్ల వలన క్యాన్సర్ కణాలను కూడా నాశనం చేస్తాయి.

అలాగే కణాల ఆక్సికరణ నష్టాన్ని కూడా నివారిస్తుంది.మునగలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వలన కంటి శుక్లం, కళ్ళు పొడి బారడం లాంటి సమస్యలు కూడా దూరం చేస్తుంది.

ఇక మునగలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కంటి సమస్యలను త్వరగా రాకుండా చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube