అమెరికా : విహారయాత్రలో విషాదం.. సరస్సులో మునిగి ఇద్దరు భారతీయ విద్యార్ధులు మృతి

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.సరస్సులో మునిగి ఇద్దరు భారతీయ విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు.

 2 Youths From India Drown In Us Lake Details, India, Drown ,us Lake, Pargat Sin-TeluguStop.com

మృతులను పంజాబ్‌లోని మోహనా గ్రామానికి చెందిన సచిన్ కుమార్ (22),( Sachin Kumar ) పర్గత్ సింగ్ (27)గా( Pargat Singh ) గుర్తించారు.పోలీసులు చెబుతున్న దానిని బట్టి.

పర్గత్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆదివారం కాలిఫోర్నియాలోని( California ) ఓ సరస్సు వద్దకు వెళ్లాడు.ఈ క్రమంలో సచిన్, పర్గత్‌లు నీటిలో మునిగిపోయారు.

పర్గత్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించినప్పటికీ అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు కోల్పోయాడు.

పర్గత్ మరణవార్త తెలుసుకున్న అతని తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తాను సర్వం కోల్పోయానని .పర్గత్ ఎనిమిదేళ్ల క్రితం అమెరికా( America ) వెళ్లి తన పెళ్లి కోసం జనవరిలో ఇంటికి వచ్చాడని గుర్తుచేసుకుంటున్నారు.సరస్సు( Lake ) వద్దకు వెళ్లొద్దని తన కోడలు వేడుకుందని, అయినప్పటికీ పర్గత్ మొండిగా వెళ్లి ప్రాణాలు కోల్పోయాడని ఆయన కన్నీటి పర్యంతమవుతున్నారు.తన కుమారుడి మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు సాయం చేయాలని ఆయన ఇరు ప్రభుత్వాలను కోరుతున్నాడు.

Telugu America, Calinia, Calinia Lake, Drown, India, Lake, Naresh Kumar, Pargat

పర్గత్ బంధువు లఖ్వీందర్ సింగ్ మాట్లాడుతూ.అతను ట్రక్ డ్రైవర్‌గా పనిచేసేవాడని, సరస్సు వద్దకు వెళ్లే ముందు భార్య, సోదరులతో మాట్లాడాడని తెలిపారు.నీటిలో ( Drown ) మునిగి అపస్మారక స్ధితిలోకి వెళ్లిన పర్గత్‌ను ఆసుపత్రికి తరలించినప్పటికీ.వైద్యులు అతని ప్రాణాలను కాపాడలేకపోయారని లఖ్వీందర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu America, Calinia, Calinia Lake, Drown, India, Lake, Naresh Kumar, Pargat

మరో మృతుడు సచిన్ మేనమామ నరేష్ కుమార్ మాట్లాడుతూ.2022లో తాము ఒక ఎకరం భూమిని విక్రయించి డాంకీ రూట్‌లో సచిన్‌ను అమెరికా పంపామని, ఇటీవలే సచిన్‌కు ఉద్యోగం దొరికిందని కానీ అంతలోనే ఈ ఘటన జరిగిందని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు.అతని మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు సహకరించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు.ఒకేసారి రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో పంజాబ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube