స్ట్రెచ్ మార్క్స్ అనేవి శరీరంలో కలిగే మార్పుల కారణంగా వస్తాయి.బరువు పెరగటం,గర్భధారణ సమయంలోను ఈ మార్కులు అనేవి ఏర్పడి మచ్చలుగా కనపడతాయి.
వీటి కోసం అనేక రకాలైన క్రీమ్స్ వాడిన ప్రయోజనం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది.అందువల్ల ఆలివ్ ఆయిల్ ని ఉపయోగించి సమర్ధవంతంగా మరియు సులభంగా స్ట్రెచ్ మార్క్స్ ని తొలగించుకోవచ్చు.
ఇప్పుడు ఆలివ్ ఆయిల్ ని ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం.
రెండు స్పూన్ల ఆయిల్ ఆయిల్ ని గోరువెచ్చగా చేసి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేయాలి.
ఈ విధంగా రాత్రి సమయంలో చేసి మరుసటి రోజు శుభ్రం చేసుకోవాలి.రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ లో రెండు స్పూన్ల బ్రౌన్ షుగర్,ఒక స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ గా తయారుచేయాలి.
ఈ పేస్ట్ ని స్ట్రెచ్ మార్క్స్ఉన్న ప్రదేశంలో రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఒక స్పూన్ నారింజ తొక్కల పొడిలో,ఒక విటమిన్ E క్యాప్సిల్,ఒక స్పూన్ ఆలివ్ఆయిల్ కలిపి పేస్ట్ గా తయారుచేయాలి.
ఈ పేస్ట్ నిపేస్ట్ గా తయారుచేయాలి.ఈ పేస్ట్ ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ లో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి పేస్ట్ గా తయారుచేయాలి.ఈ పేస్ట్ ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే స్ట్రెచ్ మార్క్స్ క్రమంగా తొలగిపోతాయి.