ప్రాణాంతక వైరస్ అయిన కరోనా తగ్గింది అని ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ వేగంగా విజృంభిస్తూ విశ్వరూపం చూపిస్తోంది.చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా అందరి ఈ మాయ దారి మహమ్మారి విరుచుకు పడుతోంది.
ఇక ఈ వైరస్ నుంచి తప్పించుకునేందుకు మాస్క్ తప్పని సరి అయిపోతుంది.అయితే ఎక్కువ సమయం మాస్క్ ధరించడం వల్ల కొందరికి ముఖంపై దద్దుర్లు వస్తుంటాయి.
వాటిని తగ్గించుకునేందుకు రకరకాల క్రీములు వాడుతంటారు.అయితే కొన్ని కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ఈ దద్దుర్లను ఈజీగా నివారించుకోవచ్చు.
ముఖంపై ఏర్పడిన దద్దుర్లను పోగొట్టడంలో చందనం పొడి గ్రేట్‌గా సహాయపడుతుంది.ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా చందనం పొడి, చిటికెడు పసుపు మరియు పాటు వేసి బాగా కలిపి చర్మంపై అప్లే చేయాలి.
పది లేదా ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే దద్దుర్లు తగ్గుముఖం పడతాయి.
అరటి తొక్కకు తేనె అప్లై చేసి దద్దుర్లు ఉన్న ప్రాంతంలో ఐదు నిమిషాల పాటు రుద్దుకోవాలి.ఆ తర్వాత కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా తరచూ చేయడం వల్ల కూడా దద్దుర్లు దూరం అవుతాయి.
అలాగే ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతుంది.
ఈ సీజన్‌లో పాలిస్టర్, నైలాన్‌తో తయారు చేసిన మాస్క్‌లు వాడితే ఎక్కువ వేడిని కలిగిస్తాయి.దాంతో ముఖంపై దద్దుర్లు ఏర్పడతాయి.
అందువల్ల, కాటన్ మాస్క్‌లు వాడాలి.మాస్క్‌ను శుభ్రంగా క్లీన్ చేసుకోకపోయినా దద్దుర్లు వస్తాయి.కాబట్టి, వేడి నీటితో మాస్క్‌ను శుభ్రపరుచుకోవాలి.
ఇక మాస్క్ పెట్టుకునే ముందు మరియు తీసిన తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకుని.
మాయిశ్చరైజర్ గానీ, సన్‌స్క్రీన్ లోషన్ గానీ చర్మానికి అప్లై చేసుకుంటే దద్దుర్లు రాకుండా ఉంటాయి.