యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Young Tiger Jr.NTR )కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.జూనియర్ ఎన్టీఆర్ డైరీ 2025 – 2026 వరకు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్న తారక్ హాలీవుడ్ ఇండస్ట్రీలోకి( Hollywood industry ) అడుగు పెడుతున్నారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఇప్పటికే బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న తారక్ హాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, ప్రొడ్యూసర్ జేమ్స్ గన్( Produced by James Gunn ) చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.
సూసైడ్ స్క్వాడ్, సూపర్ మ్యాన్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమాలకు దర్శకత్వం వహించిన జేమ్స్ గన్ ఆర్.ఆర్.ఆర్ మూవీలో జంతువులతో పాటు కిందికి దూకిన హీరోతో నేను వర్క్ చేయాలని అనుకుంటున్నానని ఆయన కామెంట్లు చేశారు.జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటుడని ఆయన చెప్పుకొచ్చారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడని ఆయన కామెంట్లు చేశారు.ప్రముఖ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్( Hollywood filmmaker ) ఈ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో నటిస్తే పాన్ వరల్డ్ హీరోగా గుర్తింపును సంపాదించుకునే ఛాన్స్ అయితే ఉంది.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 సినిమాతో బిజీగా ఉన్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా కూడా క్రేజ్ పెంచుకుంటున్నారు.జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమా( War2 movie ) ఈ ఏడాది ఆగష్టు నెల 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషల ప్రేక్షకులను సైతం అంతకంతకూ మెప్పిస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలకు సంబంధించి లుక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.