సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఖాతాలో మరో క్రేజీ రికార్డ్.. ఏం జరిగిందంటే?

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం మూవీ( Sankrantiki vastunnam movie ) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

 Crazy Record In Sankrnatiki Vastunnam Movie Account Details Inside Geos Viral-TeluguStop.com

జనవరి 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాగా ఈ సినిమాకు ఇప్పటికే 165 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రావడం గమనార్హం.ఆరో రోజు ఎక్కువ మొత్తం షేర్ కలెక్షన్లు సాధించిన సినిమా రికార్డ్ ఆర్.

ఆర్.ఆర్ మూవీ పేరుపై ఉండేది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆ రికార్డును కూడా బ్రేక్ చేసేసింది.వెంకటేశ్( Venkatesh ) సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది.నార్త్ అమెరికాలో ఈ సినిమా ఏకంగా 2.1 మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.యూకేలో సైతం ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం.సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఖాతాలో మరో క్రేజీ రికార్డ్ చేరడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

Telugu Crore Rupees, Daku Maharaj, Tollywood-Movie

మరోవైపు డాకు మహారాజ్ మూవీ( Daku Maharaj movie ) 8 రోజుల్లో 156 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పోల్చి చూస్తే ఈ సినిమా కొంతమేర వెనుకబడిందని చెప్పవచ్చు.సంక్రాంతికి వస్తున్నాం మూవీ వెంకటేశ్ ఖాతాలో హైయెస్ట్ కలెక్షన్లను సాధించడంతో పాటు మంచి లాభాలను సొంతం చేసుకుందని చెప్పాలి.

Telugu Crore Rupees, Daku Maharaj, Tollywood-Movie

వెంకటేశ్ కెరీర్లో 100 కోట్ల రూపాయల ( 100 crore rupees )షేర్ కలెక్షన్లను సాధించిన తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.వెంకటేశ్ తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.విక్టరీ వెంకటేశ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

ఈ సినిమాకు సీక్వెల్ రావాలని ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube