భోజనానికి ముందు ఒక గ్లాస్ హాట్ వాటర్( Hot Water ) తాగమని కొందరు చెబుతుంటారు.మరికొందరు ఆచరిస్తుంటారు.
అసలు భోజనానికి ముందు హాట్ వాటర్ తాగొచ్చా? తాగితే ఎటువంటి ప్రయోజనాలు లభిస్తాయి? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.భోజనానికి ముందు ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగడం అనేది మంచి ఎంపిక అవుతుంది.
ఇది జీర్ణవ్యవస్థను( Digestion ) ఉత్తేజపరుస్తుంది.వేడి నీరు ఆహారాన్ని మరింత సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయడానికి మరియు జీర్ణ ప్రక్రియను సులభతరం చేయడానికి సహాయపడుతుంది.
ఆమ్లత్వం సమస్యలను తగ్గిస్తుంది.
అలాగే భోజనానికి ముందు ఒక గ్లాస్ వేడి నీరు తాగడం వల్ల మలబద్ధకం( Constipation ) సమస్య తొలగి, విసర్జన సులభంగా జరుగుతుంది.
పేగుల్లో నిలిచిపోయిన టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి.భోజనానికి ముందు వేడి నీరు తాగితే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.ఆహారం తక్కువగా తినాలనే ఫీలింగ్ వస్తుందే.అదే సమయంలో హాట్ వాటర్ మెటాబాలిజాన్ని పెంచి.
ఫ్యాట్ త్వరగా కరిగేలా ప్రోత్సహిస్తుంది.ఫలితంగా వెయిట్ లాస్(
Weight Loss ) అవుతారు.

వేడి నీరు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించేస్తుంది.కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది.వేడి నీరు తాగడం వల్ల రక్త నాళాలు విస్తరించి, శరీరమంతా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది.గుండె సంబంధిత సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.ఇక టాక్సిన్లు బయటకు వెళ్లడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.మొటిమల బెడద తగ్గుముఖం పడుతుంది.

అయితే భోజనానికి ముందు వేడి నీరు తాగేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.వేడి నీరు మరీ వేడిగా ఉండకూడదు.గోరు వెచ్చని నీటిని మాత్రమే తీసుకోవాలి.ఎక్కువ వేడి నీరు తాగకూడదు.అలాగే భోజనానికి ముందు అంటే కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాల ముందు వేడి నీరు తాగాలి.అప్పుడే మంచి ఫలితాలు పొందుతారు.