ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఏదో ఒక దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు.ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ మత గ్రంథం అయినా ఏ మనిషికైనా తప్పు చేయండి అని చెప్పదు.
ఏ మత గ్రంథంలో అయినా ప్రపంచంలో చనిపోయే వరకు మంచిగా జీవించాలనే చెబుతారు.ఎందుకంటే ఈ భూమి ఎవరికి శాశ్వతం కాదు.
అలాగే చాలా మత గ్రంథాల ప్రకారం మనిషి తను చేసిన కర్మలకు కచ్చితంగా తగిన ఫలితాన్ని అనుభవిస్తాడు.ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు మనిషి చేసిన కర్మల ఆధారంగానే మనిషి చేసిన కర్మల ఆధారంగానే అతడు మరణించిన తర్వాత స్వర్గమా లేక నరకాన్ని లేక నరకమా అనేది నిర్ణయించబడుతుంది.
గరుడ పురాణంలో మనిషి చేసిన కర్మ ఆధారంగానే ఒక మనిషి ఆ తర్వాత జన్మ అనేది ఉంటే ఆ జన్మల లో ఏ రూపంలో జన్మిస్తాడు అనేది కచ్చితంగా రాసి ఉంది.గరుడ పురాణంలో దీని ఏమి రాసి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
స్త్రీలపై అత్యాచారాలు చేసేవారు, వారిని కష్టాలకు గురిచేసేవారు,అక్రమ సంబంధాలు మరుజన్మలో భయంకరమైన రోగాల బారిన పడతారని గరుడ పురాణంలో ఉంది.గురువు భార్యతో తప్పుగా ప్రవర్తించే వ్యక్తి కుష్టు వ్యాధి బారిన పడతాడు.

మోసం చేసేవారు వచ్చే జన్మలో గుడ్లగూబగా జన్మిస్తారని గరుడ పురాణం రాసి ఉంది.జంతువులను హింసించడం, వేటాడడం,పరాయి సొమ్మును దోచుకునే వాడు లాంటి పనులు చేసి కుటుంబాన్ని పోషించే వ్యక్తి తర్వాతి జన్మలో కసాయి చేతిలో బలి అయ్యే మేక అవుతాడు.తల్లిదండ్రులను, తోబుట్టువులను వేధించే వ్యక్తి తర్వాతే జన్మలో గర్భంలోనే చనిపోతాడు.భూమి మీద ఉన్న ఏ వ్యక్తి అయినా మరణించే చివరి క్షణంలో భగవంతుని పేరును తలుచుకుంటే అతను ముక్తి మార్గంలో ప్రయాణిస్తాడని గరుడ పురాణంలో ఉంది.
ఇంకా చెప్పాలంటే ఒక మహిళను హత్య చేసిన లేదా ఆమెకు గర్భస్రావం చేయించిన వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధితో పుడుతాడు.

DEVOTIONAL