వయసు పైబడిన యవ్వనంగా కనిపించాలని ఎవరు కోరుకోరు చెప్పండి.కానీ దురదృష్టం ఏంటంటే ప్రస్తుత రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే స్కిన్ ఏజింగ్ ( Skin Aging )అనేది స్టార్ట్ అవుతుంది.
అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరంతో స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేయవచ్చు.యూత్ ఫుల్ స్కిన్ ను మీ సొంతం చేసుకోవచ్చు.
అందుకోసం ముందుగా ఒక పెద్ద క్యారెట్( Carrot ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి సన్నగా తురుముకోవాలి.ఇప్పుడు ఈ క్యారెట్ తురుమును ఒక గంట పాటు ఎండలో పెట్టుకోవాలి.
ఆ తరువాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు కోకోనట్ ఆయిల్( Coconut oil ) లేదా ఆల్మండ్ ఆయిల్ వేసుకోవాలి.అలాగే క్యారెట్ తురుము మరియు గుప్పెడు ఆరెంజ్ తొక్కలు( Orange peels ) వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఉంచి డబుల్ బాయిలర్ మెథడ్ లో దాదాపు 15 నిమిషాల పాటు ఉడికిస్తే ఆల్మోస్ట్ మనం సీరం అనేది రెడీ అవుతుంది.

స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో సీరం ను ఫిల్టర్ చేసుకోవాలి.ఆపై అందులో చిటికెడు కుంకుమ పువ్వు వేసి బాగా మిక్స్ చేసి చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక ఒక బాటిల్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.
రోజు నైట్ నిద్రించే ముందు ఫేస్ వాష్ చేసుకుని తయారు చేసుకున్న సీరంను ముఖానికి, మెడకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

రెగ్యులర్ గా ఈ హోమ్ మేడ్ సీరం ను కనుక వాడటం అలవాటు చేసుకున్నారంటే మీ స్కిన్‌లో వచ్చే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు.ఈ సీరం యవ్వనమైన మెరిసే చర్మాన్ని అందిస్తుంది.ముడతలు, చారలు, చర్మం సాగడం వంటి వృద్ధాప్య ఛాయలు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.
అంతేకాకుండా ఈ సీరంను వాడటం వల్ల చర్మంపై ఎటువంటి మచ్చలు ఉన్నా తగ్గుముఖం పడతాయి.మరియు స్కిన్ స్మూత్ గా, షైనీగా సైతం మారుతుంది.







