ఈ మధ్య షార్ట్ హెయిర్( Short hair ) అనేది ఫ్యాషన్ అయిపోయినప్పటికీ కూడా కొందరు అమ్మాయిలు మాత్రం లాంగ్ హెయిర్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.జుట్టును పొడుగ్గా పెంచుకునేందుకు ఆరాటపడుతున్నారు.
మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా.? లాంగ్ హెయిర్ ను కోరుకుంటున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీకు చాలా బాగా సహాయపడుతుంది.ఈ రెమెడీని పాటిస్తే కొద్ది రోజుల్లోనే మీరు మంచి ఫలితాలను పొందుతారు.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, పది లవంగాలు మరియు ఒక కప్పు వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు స్టవ్ పై మెంతులు లవంగాలను ఐదు నిమిషాల పాటు ఉడికించి వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక కలబంద ఆకును వాటర్ తో శుభ్రంగా కడిగి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఉడికించిన రైస్ వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ మరియు మెంతులు లవంగాలు మరిగించిన వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం శుభ్రంగా తల స్నానం చేయాలి.
ఈ రెమెడీని వారానికి ఒక్కసారి పాటించిన చాలు బోలెడు లాభాలు పొందుతారు.ముఖ్యంగా ఈ రెమెడీ జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.ఒత్తయిన పొడవాటి కురులను మీ సొంతం చేస్తుంది.
అలాగే ఈ రెమెడీ తలలో చుండ్రు సమస్యను అరికడుతుంది.స్కాల్ప్ ను ఆరోగ్యంగా మారుస్తుంది.
హెయిర్ ఫాల్( Hair fall ) సమస్యకు అడ్డుకట్ట వేస్తుంది.చాలామంది తమ హెయిర్ స్ప్లిట్ అవుతుందని బాధపడుతూ ఉంటారు.
అయితే చిట్లిన జుట్టును రిపేర్ చేయడానికి ఇప్పుడు చెప్పుకున్న రెమెడీ అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. జుట్టు చిట్లడం, విరగడం వంటివి తగ్గుతాయి.
కురులు ఆరోగ్యంగా దృఢంగా మారతాయి.