బాలీవుడ్ రామాయణ్ సినిమాను మిస్ చేసుకున్న బ్యూటీ ఎవరో తెలుసా.. ఆ రీజన్ వల్లే నో చెప్పారా?

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు కథలను రిజెక్ట్ చేయడం ఆ తర్వాత ఆ పాత్రలు వేరే హీరో హీరోయిన్లు చేసి హిట్ కొట్టడం లేదంటే ఫ్లాప్ అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి.అయితే కొన్ని కొన్ని సార్లు సినిమా హిట్ అయినప్పుడు అలాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నందుకు చాలా మంది బాధపడుతూ ఉంటారు.

 Its Srinidhi Before Sai Pallavi For Sita Role In Ramayana Details, Srinidhi, Sai-TeluguStop.com

కొంతమంది కొన్ని రీజన్స్ వల్ల కూడా నో చెప్పేస్తూ ఉంటారు.కొన్ని పాత్రలు చాలా అరుదుగా దక్కుతుంటాయి.

అలాంటి అవకాశం వచ్చినప్పుడు వెంటనే ఒడిసి పట్టుకోవాలి.అయితే శ్రీనిధి శెట్టి( Srinidhi Shetty ) కూడా అదే పని చేసింది.

Telugu Ramayana, Ranbir Kapoor, Sai Pallavi, Sita Role, Srinidhi, Srinidhishetty

కానీ ఆఖరి నిమిషంలో చేజార్చుకుంది.శ్రీనిధి ఏ సినిమాను, ఏ పాత్రను చేజార్చుకుంది అన్న విషయానికి వస్తే.బాలీవుడ్ లో రామాయణ( Ramayana ) ప్రాజెక్టు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.రణబీర్ కపూర్( Ranbir Kapoor ) రాముడిగా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులోకి సీత పాత్ర కోసం ముందుగా శ్రీనిధి శెట్టిని అనుకున్నారట.

సీత పాత్ర కావడంతో శ్రీనిధి కూడా ఓకే చెప్పింది.ఆడిషన్ కూడా ఇచ్చింది.దర్శకుడు నితీష్ తిరావి కూడా హ్యాపీ.కానీ అంతలోనే రావణుడి పాత్ర కోసం యష్ ను( Yash ) ఎంపిక చేశారట.

యష్-శ్రీనిథి సూపర్ హిట్ కాంబినేషన్.కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2లో ఇద్దరూ కలిసి నటించారు.

Telugu Ramayana, Ranbir Kapoor, Sai Pallavi, Sita Role, Srinidhi, Srinidhishetty

ఇప్పుడు రామాయణలో రావణుడిగా యష్, సీతగా శ్రీనిధి అంటే కాంబినేషన్ వర్కవుట్ కాకపోవచ్చని మూవీ మేకర్స్ భావించారట.అయితే ఇలా శ్రీనిథి కూడా ఇదే ఫీలైందట.అందుకే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట.ఆమె తప్పుకున్న తర్వాత సాయి పల్లవిని( Sai Pallavi ) ఎంపిక చేశారట.సీత పాత్రకు సాయిపల్లవి సరిగ్గా సరిపోతుందంటూ మెచ్చుకుంది శ్రీనిధి శెట్టి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube