సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఒక సాదాసీదా హీరోగానే ఎంట్రీ ఇస్తారు.అయితే ఆ హీరోలు స్టార్ హీరోలు కావాలా లేకపోతే చిత్రపరిశ్రమలో కనుమరుగు అవ్వాలా అన్నది డిసైడ్ చేసేది మాత్రం ప్రేక్షకులే.
ఇక ఎంత బడ్జెట్ తో సినిమా తీసిన ఎలాంటి స్టార్ నటులు ఉన్న సినిమా హిట్టు ఫ్లాపు నిర్ణయించేది ప్రేక్షకులు అందుకే ప్రేక్షకుల పంథానీ బట్టి సినిమాలను తెరకెక్కిస్తు ఉంటారు దర్శక నిర్మాతలు.కొంతమంది దర్శకులు భారీ అంచనాల మధ్య తెరకెక్కించి చివరికి ఎన్నో కోట్ల నష్టాలను చవి చూస్తూ ఉంటారు.ఇక అలాంటి సినిమాల లిస్ట్ ఏంటో తెలుసుకుందాం.
అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం బాంబే వెల్వెట్.2015 లో 120 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చింది ఈ సినిమా.ఇక ఈ పిరియాడికల్ థ్రిల్లర్ డ్రామా స్టోరీ బాగుంది.
కానీ అటు దర్శకుడు టేకింగ్ మాత్రం ప్రేక్షకులకు నచ్చలేదు.విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా కమర్షియల్గా మాత్రం లాభాలు తెచ్చిపెట్టింది.
చివరికి ఫ్లాప్ గానే మిగిలిపోయింది.బాలీవుడ్ బాద్షా సల్మాన్ ఖాన్ హీరోగా 135 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ట్యూబ్ లైట్.
సల్మాన్ కెరీర్లోనే డిజాస్టర్గా నిలిచింది ఈ సినిమా.ఇక కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చివరికి నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది.
ఇక యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా రేస్ ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.భారీ కలెక్షన్స్ తో నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.
ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన రేస్ 3 అదే రేంజ్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ అయ్యింది.

ఏకంగా 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కనీసం 160 కోట్లు కూడారాబట్టలేక నిర్మాతలను నష్టాల పాలు చేసింది.ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్,బాబి, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లాంటి వారు ఉన్నప్పటికీ సినిమా మాత్రం హిట్ కొట్టలేకపోయింది అని చెప్పాలి.ఇలా భారీ అంచనాల మధ్య వచ్చి చివరికి అట్టర్ ఫ్లాప్ గా నిలిచి ప్రేక్షకులను నిరాశ పరిచాయి ఎన్నో సినిమాలు.
ఇక ఇలాంటి సినిమాలు ఎంత పెద్ద స్టార్స్ ఉన్న ఇక సినిమాలో కథ బాగుండాలి డైరెక్టర్ టేకింగ్ బాగోకపోతే ఫ్లాప్ అవడం ఖాయం అని నిరూపించాయ్.