టాలీవుడ్ బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల గురించి తెలియని వారెవ్వరూ లేరు.ఇక ఈమె యాంకరింగ్ చేసే విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే.
తన మాటలతో అందరిని ఆకట్టుకుంది.ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.కానీ అంత క్రేజ్ సొంతం చేసుకోలేకపోయింది.
బుల్లితెరపై మాత్రం స్టార్ గా నిలిచింది.ఆమె వేసే పంచ్ లు మాత్రం ఓ రేంజ్ లో పేలుతాయి.సుమ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తీరికలేని లైఫ్ గడుపుతున్న సుమ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచింది.
ఇప్పటివరకు తన యాంకరింగ్ విషయంలో కానీ, తన మాటల్లో గాని ఎటువంటి నెగటివ్ ను దరికి రానీయకుండా ముందుకు సాగుతుంది.ఎన్నో సినిమా ఈవెంట్లలో, సినిమా ప్రమోషన్స్ ఈవెంట్లలో పాల్గొని బాగా సందడి చేస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి దర్శకత్వంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఆర్ఆర్ఆర్ సిని బృందాన్ని కూడా ఇంటర్వ్యూ చేసింది.అందులో తారక్, చెర్రీ, జక్కన్న పాల్గొని తమ సినిమా గురించి చాలా విషయాలు పంచుకున్నారు.
మధ్యలో సుమ వేసిన పంచులు బాగా హైలెట్ గా మారాయి.ఇక మీమ్స్ చూపిస్తూ మరింత నవ్వించింది సుమ.

ఇక అందులో రాజమౌళి గతంలో ఈ సినిమాను 2020లో విడుదల చేస్తామని చెప్పటంతో ఆ విషయాన్ని రవితేజ, బ్రహ్మానందం కాంబినేషన్ మీమ్ లో నేనింతే అని వీడియో చూపించి బాగా నవ్వించింది.ఇక అప్పుడే ఎన్టీఆర్ 2021, 2022 అవ్వదు అని ఎలా తెలుసు అని ప్రశ్నించడంతో.వెంటనే సుమ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అని సమాధానమిచ్చింది.

ఆయన గురించి ఆయనకు బాగా తెలుసు అని.రెండు మూడేళ్లు పట్టవచ్చని తారక్ చెప్పటంతో రాజమౌళి తెగ ఫీల్ అయ్యాడు.అయినా కూడా సుమ అంతటితో ఆగకుండా.
ఆరు నెలల్లో తీయాల్సిన ఈగ సినిమాను రెండేళ్లు చేశాడని.ఆరు నెలలో తీయాల్సిన మర్యాద రామన్న 18 నెలలు తీసాడని.
లక్కీగా ఈగ కాబట్టి రెండేళ్లయ్యింది.బొద్దింక అయితే ఇంకా ఎన్ని నెలలు పట్టేదో అని జక్కన్న పరువు తీసింది సుమ.







