మధుమేహం.ప్రపంచాన్ని.గజగజా వణికిస్తున్న జబ్బు.దీని దెబ్బకి.ప్రతీ ఏటా మధుమేహ మరణాల సంఖ్య ఎక్కువై పోతోంది…ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.ప్రపంచంలో అత్యధిక మరణాలు ఎక్కువగా జరిగేది.
గుండె జబ్బులతో.కానీ ఇప్పుడు ఆ స్థానంలో డయాబెటిస్ (మధుమేహం) వచ్చేలా ఉంది అని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు.
అయితే మధుమేహం రాకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది అని వైద్యులు సూచిస్తున్నారు.ఎటువంటి ఆహరం తీసుకోవాలి.
ఎలా తినాలో అనే నియమాన్ని పాటిస్తే చాలు.
ఆస్ట్రేలియాకు చెందిన ‘ద జార్జ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’ వర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడించిన విషయాల ప్రకారం.ఒమెగా-6 పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండే సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్, పప్పులు ఎక్కువగా తింటే మధుమేహం వచ్చే ముప్పు గణనీయంగా తగ్గుతుందట.
కుటుంబంలో మధుమేహం ఉన్నవారు తాము తాము సూచించినట్టుగా ఆహారంలో ఒమెగా-6 కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలను భాగం చేసుకుంటే షుగర్ వచ్చే ముప్పును తగ్గించవచ్చని ఈ అధ్యయనం నిర్వహించిన జాసన్ వు తెలిపారు.
వైద్యుల సలహా తీసుకుని.కొన్ని రకాల ఆహార పద్దతుల్ని పాటిస్తే మధుమేహం మరింత తీవ్రతరం కాకుండా చూస్తుంది…అని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.