చిన్నప్పుడు మనకొచ్చిన 14 వింత డౌట్ లు ఇవే..! సమాధానం చెప్పాలంటే పెద్దలకు సవాలే.!

చిన్న పిల్లలు అంటే అంతే.వారిది తెలిసీ తెలియని వయస్సు కదా.

 14 Different Doubts On Childhood Days Funny-TeluguStop.com

అందుకే ప్రశ్నలు ఏం అడగాలో, ఏం అడగకూడదో తెలియదు.కొన్ని సార్లు వారు అడిగే ప్రశ్నలకు పెద్దలకు ఏం సమాధానాలు చెప్పాలో అర్థం కాదు.

అలాంటి చిత్రాతి చిత్రమైన ప్రశ్నలను అడుగుతారు.అవి మనకు నవ్వును తెప్పిస్తాయి.

ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.షాక్‌కు గురి చేస్తాయి.

కొన్నింటికి మనం సమాధానాలు చెబుతాం.కొన్నింటికి ఏం చెప్పాలో అర్థం కాదు.ఈ క్రమంలోనే చిన్నారులు అడిగే అలాంటి చిత్రమైన ప్రశ్నలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.!

1.పిల్లల కన్నా పెద్దలే గొప్పవాళ్లు, మంచివాళ్లా ?
ఈ ప్రశ్న పిల్లలు అడిగితే ఎవరూ జవాబు చెప్పలేరు.కానీ వారికి ఏం చెప్పాలంటే… అందరూ మంచివాళ్లే అని చెప్పాలి.

కాకపోతే కొందరు పెద్దయ్యాక చెడుగా మారుతారు అని ఉదాహరణలను వివరించి చెబితే పిల్లలు తెలుసుకుంటారు.

2.గడియారం ముళ్లు అలాగే ఎందుకు తిరుగుతాయి ?
పిల్లలు గనక ఈ ప్రశ్న అడిగితే పేపర్‌, పెన్సిల్‌తో ఒక సన్‌ డయల్‌ ఏర్పాటు చేసి సూర్యుడి నీడ ఎలా తిరుగుతుందో చెప్పండి.అందుకు అనుగుణంగా గడియారం ముళ్లు తిరుగుతాయని చెప్పండి.

3.భూమిపై ఉన్న అందరం ఒకే భాష ఎందుకు మాట్లాడం ?
భూమిపై మనిషి జన్మ ప్రారంభమైనప్పుడే కొందరు ప్రజలు వర్గాలుగా విడిపోయారని, అందుకే వారు తమ వర్గానికి అనుగుణంగా తమకిష్టమైన భాష మాట్లాడుతారని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి.

4.జంతువులు, పక్షులు మాట్లాడుతాయా ?
కేవలం మనిషికి తప్ప జంతువులు, పక్షులకు మాట్లాడే శక్తి లేదని చెప్పండి.

5.టైం అంటే ఏమిటి ?
పుట్టిన రోజులు, ఇతర స్పెషల్‌ రోజులు, తేదీలను ఉదహరిస్తూ టైం ఎందుకు ముఖ్యమో, అది మనకు ఎందుకు కావాలో చెప్పండి.

6.నేను ఇలాగే ఎందుకు ఉన్నా ?
భూమిపై జన్మించే ప్రతి ఒక్కరు ఒకే విధంగా ఉండరని, వేర్వేరుగా ఉంటారని చెప్పండి.అలా ఉంటేనే అందరినీ గుర్తించడం సాధ్యమవుతుందని చెప్పండి.

7.నేనెందుకు పుట్టా ?
ఈ ప్రశ్నకు ప్రేమగా సమాధానం చెప్పండి.మా ప్రేమను పంచుకునేందుకు నువ్వు కావాలి, అందుకే నువ్వు పుట్టావు అని సమాధానం చెప్పండి,

8.అబద్దం ఆడరాదు, మరి పెద్దలు ఎందుకు అబద్దాలు చెబుతారు ?
మనిషి అన్నాక తప్పులు చేయడం, అబద్దాలు చెప్పడం జరుగుతుందని పిల్లలకు తెలియజేయండి.

9.నేను సినిమా యాక్టర్లలా ఎందుకు లేను ?
భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి విభిన్నమైన శరీరం, రంగును, దేహాకృతిని కలిగి ఉంటాడని చెప్పండి.అందుకనే వ్యక్తులను ఎవరైనా గుర్తిస్తారని చెప్పండి.

10.నేను కరెక్ట్‌ నిర్ణయం ఎలా తీసుకోవాలి ?
ఎదుటి వారికి హాని కలిగించకుండా తమకు హ్యాపీగా ఉండేలా తీసుకునే ఏ నిర్ణయమైనా మంచిదే అని చెప్పండి.

11.పగటి పూట మనకు చంద్రుడు ఎందుకు కనిపిస్తాడు ?
చంద్రుడు పౌర్ణమి రోజున ఎలా వస్తాడు, అమావాస్య రోజున ఎందుకు రాడు అనేది వివరిస్తూ చెప్పండి.

12.ఇంద్ర ధనుస్సు ఎలా తయారవుతుంది ?
ఎండగా ఉన్నప్పుడు వర్షం పడితే ఇంద్ర ధనుస్సు వస్తుందని చెప్పండి.

13.ఎరో ప్లేన్‌లో టాయిలెట్‌కు వెళితే అది కింద ఉన్న వారిపై పడుతుందా ?
ఎరోప్లేన్‌లో టాయిలెట్స్‌ ఉంటాయని, వాటిల్లో ఉన్న వ్యర్థాన్ని ఎయిర్‌ పోర్టులో ప్లేన్ దిగినప్పుడు క్లీన్‌ చేస్తారని చెప్పండి.

14.వేరే గ్రహంపై స్పేస్‌ సూట్‌ లేకుండా వెళ్లగలమా ?
వెళ్లలేమని చెప్పండి.అది సాధ్యం కాదని చెప్పండి.భూమికి ఉన్న గురుత్వాకర్షణను తెలియజేయండి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube