సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.ఓ ఫారిన్ లేడీ ఇండియాలోని బీచ్‌లో సెల్ఫీలకు 100 రూపాయలు ఛార్జ్ చేస్తూ కనిపించింది.
దీంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు, అంతేకాదు ఆమె తెలివితేటలకు ఫిదా అయిపోతున్నారు.ఆ అమ్మాయి ఇన్‌స్టా ఐడీ ఏంజెలీనాలి 777 (@Angelinali777).
ఇండియాకు వచ్చే ఫారిన్ టూరిస్టులకు(foreign tourists) తరచూ ఎదురయ్యే ఒక కామన్ ప్రాబ్లమ్‌ను ఈ వీడియో హైలైట్ చేస్తోంది.చాలామంది లోకల్స్ వాళ్లను చూడగానే సెల్ఫీల(Selfies) కోసం వెంటపడుతుంటారు.
ముఖ్యంగా పాపులర్ బీచ్‌లలో అయితే ఈ బాధ వర్ణనాతీతం.చాలామందికి ఫారిన్ వాళ్లంటే విపరీతమైన క్యూరియాసిటీ.
అందుకే వాళ్లను చూడగానే ఫోటోలు దిగాలని తెగ ఉత్సాహపడుతుంటారు.కానీ ఒక్కోసారి ఈ శ్రద్ధ కాస్త చిరాకు తెప్పిస్తుంది.
ఈమె కూడా అదే పరిస్థితిని ఫేస్ చేసింది.‘ఫోటో ప్లీజ్’ (Photo please)అని పదే పదే అడగడంతో విసిగిపోయి ఒక ఐడియా వేసింది.అంతే, ఇకపై ఎవరైనా సెల్ఫీ కావాలంటే 100 రూపాయలు ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పేసింది.బీచ్‌లో ఒక బోర్డు పెట్టుకుని నిల్చుంది.దానిపై ‘ఒక సెల్ఫీ రూ.100’( Rs.100 for selfie) అని రాసి ఉంది.ఆ వీడియోను ఆమె ఆన్‌లైన్‌లో షేర్ చేసింది.
చాలామంది ఆమెకు డబ్బులిచ్చి మరీ సెల్ఫీలు దిగడం అందులో కనిపించింది.ఆమె తెలివితేటలకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.‘సూపర్ బిజినెస్ ఐడియా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కొందరైతే ఆమెకు ట్యాక్స్ పడుతుందేమో, వీడియోతో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు అడ్డంగా దొరికింది కదా అని జోకులు పేల్చారు.మరికొందరు ధరను వెయ్యి రూపాయలకు పెంచమని సలహా ఇచ్చారు.
అయితే ఈ వీడియో మరో ముఖ్యమైన విషయాన్ని కూడా వెలుగులోకి తెచ్చింది.చాలామంది దేశీయులు, ముఖ్యంగా మగవాళ్లు ఫారిన్ అమ్మాయిలను ఫోటోల కోసం ఇబ్బంది పెడుతుంటారు.ఇది వాళ్లకు చాలా అసౌకర్యంగా ఉంటుంది.
కొంతమంది నెటిజన్లు ఈ ప్రవర్తనను చూసి సిగ్గుపడుతున్నారు.ఇది చాలా చండాలంగా, అతిగా ప్రవర్తించడంగా ఉందని విమర్శిస్తున్నారు.“‘మా దేశంలోని మగవాళ్లను చూస్తే సిగ్గేస్తోంది’ అని ఒక యూజర్ కామెంట్ చేయగా, మరొకరు ఇలాంటి పనులు ‘సిగ్గులేనితనం’ అని తిట్టిపోశారు.”
ఏది ఏమైనా.ఈ అమ్మాయి చేసిన చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.కల్చరల్ బిహేవియర్, పర్సనల్ బౌండరీస్ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు.