Pimples : మొటిమ‌లు మ‌చ్చ‌లుగా మారుతున్నాయా.. అయితే ఈజీగా వాటిని వ‌దిలించుకోండిలా!

టీనేజ్‌ ప్రారంభం అయ్యిందంటే చాలు యువతి యువకులను మొటిమల సమస్య( Pimples ) ప్రధానంగా వేధిస్తుంటుంది.అయితే కొందరిలో మొటిమలు త్వరగానే తగ్గుతాయి.

 This Home Remedy Helps To Remove Acne Marks Naturally-TeluguStop.com

కానీ కొందరిలో మాత్రం మొటిమలు మచ్చలుగా మారుతుంటాయి.ఆ మచ్చలు ఓ పట్టాన పోనే పోవు.

ఈ క్రమంలోనే ముఖంపై మొటిమ‌ల కార‌ణంగా ఏర్ప‌డిన మచ్చలను వదిలించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీకు చాలా బాగా సహాయపడుతుంది.ఈ రెమెడీని పాటిస్తే ఈజీగా మొటిమలు తాలూకు మచ్చలను( Acne Scars ) వదిలించుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త అయ్యాక అంగుళం దాల్చిన చెక్క, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి.అలాగే కొన్ని గులాబీ రేకులు కూడా వేసి కనీసం 15 నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Acne, Acne Scars, Tips, Clear Skin, Skin, Remedy, Latest, Skin Care, Skin

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వాటర్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి( Multani Mitti ), హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి.అలాగే తయారు చేసి పెట్టుకున్న వాటర్ ను సరిపడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి ప్యాక్ లా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

Telugu Acne, Acne Scars, Tips, Clear Skin, Skin, Remedy, Latest, Skin Care, Skin

ఆపై చర్మాన్ని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ హోమ్ రెమెడీని కనుక పాటించారంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు క్రమంగా మాయం అవుతాయి.క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.అలాగే ఈ రెమెడీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.అందంగా మెరిపిస్తుంది.మ‌రియు స్కిన్ టోన్( Even Skin Tone Remedy ) ను ఈవెన్ గా మారుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube