అతి ఆకలి( Extreme hunger ).చాలా మంది ఈ సమస్యతో సతమతం అవుతుంటారు.
దీని కారణంగా ఏం తిన్నా సరే మళ్లీ కొద్దిసేపటికి ఆకలి వేసేస్తుంటుంది.ఇలా తరచూ ఆకలి వేయడం వల్ల పనిపై శ్రద్ధ పెట్టలేకపోతుంటారు.
పైగా ఏది పడితే అది పొట్టలోకి తోసేస్తుంటారు.ఫలితంగా శరీర బరువు అదుపు తప్పుతుంది.
అనేక అనారోగ్య సమస్యలు సైతం తలెత్తుతాయి.మీరు కూడా అతి ఆకలితో బాగా విసిగిపోయారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే లడ్డూను మీరు కచ్చితంగా రోజు తినాల్సిందే.అతి ఆకలిని దూరం చేయడానికి ఈ లడ్డూ అద్భుతంగా సహాయపడుతుంది.
అదే సమయంలో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను సైతం అందిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ లడ్డును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో అర కప్పు గుమ్మడి గింజలు ( Pumpkin seeds )వేసి మంచిగా వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు సత్తు పొడి వేసుకుని వేయించుకోవాలి.మంచిగా ఫ్రై అయిన అనంతరం అందులో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు పీనట్ బటర్ వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి.తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న సత్తు పొడి( Sattu is dry ) మరియు గుమ్మడి గింజలతో పాటు అరకప్పు తేనె వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ( Ghee )వేసి లడ్డూల మాదిరి చుట్టుకోవాలి.ఈ లడ్డూలను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజుకు ఒకటి చొప్పున రెగ్యులర్ గా ఈ లడ్డూను తీసుకోవాలి.ఈ లడ్డూ లో ప్రోటీన్ పుష్కలంగా నిండి ఉంటుంది.నిత్యం ఈ లడ్డూను తీసుకుంటే మీ శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ లభిస్తుంది.అలాగే ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంటుంది.
అతి ఆకలి సమస్య దూరం అవుతుంది.దీంతో తరచూ ఫుడ్ పై మనసు లాగకుండా ఉంటుంది.
పనిపై ఏకాగ్రత పెరుగుతుంది.అలాగే ఈ లడ్డూను రోజుకొకటి చొప్పున తీసుకుంటే మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది.
నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మరియు వెయిట్ లాస్ కూడా అవుతారు.







