బాన పొట్టతో( Belly Fat ) బాధపడుతున్నారా.? శరీరం మొత్తం నాజూగ్గా ఉన్న కూడా పొట్ట వద్ద మాత్రం కొవ్వు భారీగా పేరుకుపోయిందా.? బెల్లీ ఫ్యాట్ సమస్యను వదిలించుకోవాలని భావిస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే స్మూతీ( Smoothie ) మీకు చాలా బాగా సహాయపడుతుంది.బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని కనుక యాడ్ చేసుకుంటే మీ పొట్ట కొవ్వు మటాష్ అవ్వడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ఏంటి.? దాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్న విషయాలు తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్( Rolled Oats ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మరొక బౌల్ లో వన్ టీ స్పూన్ చియా సీడ్స్( Chia Seeds ) మరియు వాటర్ పోసి అర గంట పాటు నానబెట్టుకోవాలి.ఈ లోపు ఒక గ్రీన్ ఆపిల్( Green Apple ) తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆపై బ్లెండర్ లో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, నానబెట్టుకున్న ఓట్స్ మరియు చియా సీడ్స్ వేసుకోవాలి.
అలాగే పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి( Cinnamon ) మరియు ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.దాంతో ఆల్మోస్ట్ మన స్మూతీ అనేది రెడీ అవుతుంది.
ఈ స్మూతీలో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మిక్స్ చేసి బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవాలి.ఈ యాపిల్ ఓట్స్ స్మూతీ ఫ్యాట్ కట్టర్ గా పని చేస్తుంది.పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును సమర్థవంతంగా కరిగిస్తుంది.అలాగే ఈ స్మూతీ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.అతి ఆకలిని అణచివేస్తుంది.దాంతో తినడం తగ్గిస్తారు.
ఫలితంగా బరువు తగ్గుతారు అలాగే డైట్ లో ఈ స్మూతీని చేర్చుకోవడం వల్ల అందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఎముకల దృఢత్వానికి, కండరాల నిర్మాణానికి కూడా ఈ స్మూతీ తోడ్పడుతుంది.