ఎండలు( sun ) మండిపోతున్నాయి.రోజురోజుకు ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి.
ఈ వేసవి కాలంలో గంట బయట తిరిగిన కూడా నీరసం, అలసట, అధిక దాహం వంటి సమస్యలు వెంటనే చుట్టు ముట్టేస్తున్నాయి.అలాగే వేసవిలో ఎండల దెబ్బకు మనలో చాలామంది పెదాలు నల్లగా మారుతూ ఉంటాయి.
డార్క్ లిప్స్ ( Dark lips )ను ఎవరూ ఇష్టపడరు.ఈ క్రమంలోనే పెదాల యొక్క నలుపును వదిలించుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు.
మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ మీకు బాగా సహాయపడతాయి.ఈ టిప్స్ తో ఈజీగా డార్క్ లిప్స్ ను రిపేర్ చేసుకోవచ్చు.మరింకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.
ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్( Glycerin ), వన్ టేబుల్ స్పూన్ తేనె( honey ) మరియు హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon juice ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసుకుని పూర్తిగా ఆరిన తర్వాత కడిగేయాలి.
రోజుకు రెండుసార్లు ఈ విధంగా చేశారంటే నలుపు వదిలిపోయి మళ్ళీ మీ పెదాలు అందంగా గ్లోయింగ్ గా మెరుస్తాయి.

అలాగే పెదాల నలుపు వదిలించడానికి బాదం నూనె చాలా బాగా సహాయపడుతుంది.రోజు నైట్ నిద్రించే ముందు బాదం ఆయిల్( Almond oil ) ను పెదాలకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ఇలా నిత్యం చేయడం వల్ల నలుపు పోవడమే కాకుండా పెదాలు మృదువుగా మారతాయి.

పెదాల నలుపు వదిలించడానికి మరొక అద్భుతమైన రెమెడీ కూడా ఉంది.అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ పెరుగు మీగడ వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు దానిమ్మ రసం, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసుకుని ఐదు నిమిషాలు పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై పెదాలను సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా పెదాల నలుపు వదిలిపోతుంది.







