చాలామంది వారి జీవన ఉపాధి కోసం రాత్రింబవళ్లు కష్టపడి డబ్బును సంపాదించి ఉన్నదాంట్లో జీవనం కొనసాగిస్తారు.మరికొందరు జీవనం సాగించడానికి పెడుదారులు పట్టడం జరుగుతుంది.
ఇందులో భాగంగా వారు దొంగతనాలు చేయడం, ఎదుటివారిని మోసం చేయడం, అలాగే బెదిరించడం లాంటి అసాంఘిక కార్యక్రమాలు చేయడం ద్వారా వారు జీవనం కొనసాగిస్తుంటారు.ఇకపోతే ప్రస్తుతం జీవితంలో బిజీ లైఫ్ వల్ల చాలామంది ఇంట్లో భోజనం తయారు చేయకుండా బయటికి రెస్టారెంట్లలో ఫుడ్ ను ఆర్డర్ చేసుకుంటూ ఇంటికి తెప్పించుకుంటున్నారు.
ఇకపోతే అలా ఆడర్ చేసిన ఫుడ్ ను తీసుకురావడానికి ఎంతోమంది ఫుడ్ డెలివరీ బాయ్స్( Food Delivery Boys ) నమ్మకంగా ఫుడ్ డెలివరీ చేస్తూ కస్టమర్స్ అభిమానాన్ని చూరగొంటుంటారు.అయితే ఇందులో కొంతమంది మాత్రం కాస్త విచిత్రమైన పనులు చేస్తూ వారి జీవితాలను రిస్కులో పెట్టుకుంటున్నారు.

కేవలం వారి జీవితాలను రిస్కుల పెట్టడం మాత్రమే కాకుండా.ఫుడ్ అందించిన సంస్థలకు కూడా చెడ్డ పేరును తీసుకువస్తున్నారు.ఇకపోతే తాజాగా ఓ స్విగ్గి డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ( Swiggy Delivery Boy ) చేయడానికి ఓ కస్టమర్ ఇంటికి వచ్చాడు.ఆ తర్వాత డెలివరీ తీసుకున్న సదరు కస్టమర్ ఇంటిలోకి వెళ్లి బయట వాకిలి వేసుకున్నారు.
ఆ తర్వాత డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేసిన తర్వాత కస్టమర్ ఇంటి నుంచి ఇంటి బయట ఉన్న నైకి షూ లను దొంగలించిన దృశ్యాలు సిసిటీవీ ఫుటేజిలో రికార్డు అయ్యాయి.

ఇక ఈ విషయంపై సదరు కస్టమర్ స్విగ్గి సంస్థను సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ.స్విగ్గి కంపెనీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది.ఫుడ్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ డీటెయిల్స్ ఇవ్వాలని కోరిన స్విగ్గి సంస్థ అందుకు రిప్లై ఇవ్వకపోవడం నిజంగా ఆశ్యర్యం కలగజేస్తుంది.
రోహిత్ అరోరా( Rohit Arora ) అనే వ్యక్తి ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.స్విగ్గి సంస్థకు చెందిన ఓ డెలివరీ బాయ్ కస్టమర్ కు డెలివరీ ఇచ్చిన తర్వాత ఇంటి బయట ఉన్న బ్రాండెడ్ షూస్( Branded Shoes ) ను ఎత్తుక పోవడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఇలా ఒక్క డెలివరీ బాయ్ దొంగతనం వల్ల మిగతా డెలివరీ బాయ్స్ కూడా ఎఫెక్ట్ పడనుంది.







