ఉపాసన( upasana ) కొణిదెల… రామ్ చరణ్( Ram Charan ) ని వివాహం చేసుకున్న తర్వాత ఉపాసన సోషల్ మీడియా సెన్సేషనల్ గా మారిపోయారు.ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా ఉపాసన గురించి చర్చ సాగుతోంది.
పదేళ్ల కాలం కి పైగా మెగా వారసుడిగా కోసం రామ్ చరణ్ అభిమానులు ఎదురు చూడగా మొత్తానికి 9 నెలల క్రితం ఆ శుభవార్త చెప్పి ఇప్పుడు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.ఈ సందర్భంగా ఉపాసన గతంలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఈ క్రమంలో ఆమె మాట్లాడే భాష గురించి అలాగే తెలుగు ఎందుకు మాట్లాడలేకపోతుందో అనే వివరాలను తెలియజేసింది ఉపాసన.
ఉపాసనకు తెలుగు మాట్లాడటం గానీ, రాయటం కానీ రాదు.కేవలం తెలుగు భాషను అర్థం చేసుకొని మళ్లీ ఇంగ్లీషులోనే బదులు చెబుతుంది.అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం పై వివరణ ఇచ్చింది.
తన కుటుంబంలో దాదాపు అందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడుకోవడం వల్ల మొదట ఉపాసన తెలుగు కు దూరం అయింది ఇక ఉపాసన తాత దాంతో ఆయన ఇంట్లో ఎక్కువగా ఉర్దూ మాట్లాడటం ద్వారా ఉపాసనకు ఉర్దూ త్వరగా నే వచ్చేసింది కానీ తెలుగు మాత్రం మాట్లాడలేకపోయింది.ఇక కొంత వయసు వచ్చిన తర్వాత ఉపాసన తల్లిదండ్రులు చెన్నైలోనే( Chennai ) ఉండేవారు దాంతో తమిళ్ వచ్చింది కానీ అక్కడ కూడా తెలుగు రాలేకపోయింది ఉపాసనకు.
తన అమ్మమ్మ కాస్త తెలుగులో మాట్లాడుతుంది కానీ ఉపాసన మాత్రం ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంది.అలా అన్ని రకాలుగా ఆమె తెలుగుకు దూరమయింది కానీ ఆమె ఉర్దూ మరియు హైదరాబాది హిందీ ఇంగ్లీష్ లాంటి భాషలను అనర్గలంగా మాట్లాడుతుంది.ఇంట్లో తన తల్లితండ్రులు కూడా ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటారని అందువల్ల తనకు తెలుగు పూర్తిగా మాట్లాడలేక పోతానని చెప్పింది ఉపాసన.ఇక తన లాగా హైదరాబాది హిందీ చాలా తక్కువగా మాట్లాడుతారని ప్రాపర్ హిందీని నేను మాట్లాడగలను కూడా చెప్తుంది.