జుట్టు విపరీతంగా ఊడిపోతుందా.. బట్టతల భయం పట్టుకుందా.. అయితే ఈ ఆయిల్ మీకోసమే!

కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం పాటు కూర్చుని పని చేయడం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, పెరిగిన కాలుష్యం కారణంగా చాలా మంది పురుషుల్లో హెయిర్ ఫాల్ అనేది అత్యధికంగా ఉంటుంది.ఇలాంటి వారు ఎంతగానో వర్రీ అవుతుంటారు.

 Best Oil For Stop Hair Fall And Avoiding Baldness! Hair, Oil, Hair Care, Hair Ca-TeluguStop.com

జుట్టు విపరీతంగా ఊడుతుంటే ఎక్కడ బట్టతల వచ్చేస్తుందో అని భయపడుతూ ఉంటారు.ఆ భయం మీకు పట్టుకుందా.? అయితే అసలు టెన్షన్ పడకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ను వాడితే మీకు బట్టతల భయమే అక్కర్లేదు.

ఈ ఆయిల్ జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడుతుంది.అదే సమయంలో జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి ఐరన్ కడాయి పెట్టుకుని ఒక గ్లాస్ ఆవనూనె ( Mustard oil )వేసుకోవాలి.

ఆయిల్ హీట్ అవ్వడానికి ముందే ఒక కప్పు ఉల్లి కాడలు వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులు( fenugreek ), వన్ టేబుల్ స్పూన్ శీకాకై పౌడర్, నాలుగు పొట్టు తొలగించి దంచిన వెల్లుల్లి రెబ్బలు( Garlic cloves ) మరియు నాలుగు రెబ్బలు కరివేపాకు వేసి స్లో ఫ్లేమ్ పై దాదాపు ప‌న్నెండు నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

Telugu Baldness, Care, Care Tips, Fall, Thick-Telugu Health

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లార బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకుని స్టోర్ చేసుకుంటే దాదాపు నెల రోజుల పాటు వాడుకోవచ్చు.ఇక ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి కనీసం ప‌ది నిమిషాలు అయినా మసాజ్ చేసుకోవాలి.

Telugu Baldness, Care, Care Tips, Fall, Thick-Telugu Health

ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు మైల్డ్ షాంపూను ( Mild shampoo )యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడితే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది.అదే సమయంలో బట్టతల వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుముఖం పడుతుంది.బట్టతలకు దూరంగా ఉండాలని అనుకునేవారికి ఈ ఆయిల్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube