భూమి లోపల తేమశాతం ( Moisture ) అధికంగా ఉన్నప్పుడు మట్టిలో పుట్టే ఫంగస్ ( Fungus ) వల్ల వేరు కుళ్ళు తెగులు పసుపు పంటను ఆశిస్తాయి.లేతగా ఉండే చిన్న మొక్కలకు ఈ తెగులు వ్యాప్తి చెందితే తీవ్ర పంట నష్టం వాటిల్లుతుంది.
వర్షపు నీరు, పంటకు అందించిన నీరు నేలపై నిల్వ ఉంటే నేలలో తేమశాతం క్రమంగా పెరిగి ఈ ఫంగస్ వ్యాపిస్తుంది.ముందుగా ఈ ఫంగస్ వేర్లపై ( Roots ) ప్రభావం చూపుతుంది.
దీంతో వేర్లు కుళ్ళిపోవడం, లేత మొక్క కాండం ఉబ్బడం, మొక్క యొక్క ఆకులు క్రమంగా పసుపు రంగులోకి మారడం జరుగుతుంది.ఆకులు పూర్తిగా పసుపు రంగులోకి మారిపోయిన తర్వాత వాలి పోయి ఎండిపోయి చనిపోతాయి.

ఈ వేరుకుళ్లు తెగులు సోకిన తర్వాత అరికట్టడం కంటే, అసలు ఈ తెగులు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి పంట నష్టం జరిగే అవకాశం ఉండదు.పసుపు పంటను( Turmeric Crop ) సాగు చేయాలి అనుకున్నప్పుడు ముందుగా పొలంలో నీరు నిల్వ ఉండకుండా సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.పసుపు నాటడానికి ముందు నేల బాగా ఆరిందా లేదా అని చూసుకోవాలి.కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయాలి.మట్టికి సవరణలు చేయడానికి ఒక చదరపు కిలోమీటర్ కు 250 గ్రాముల వేపచక్క మరియు సున్నం వేయాలి.పొలంలో వేరు కుళ్ళు సోకిన మొక్కలను వెంటనే పంట నుండి వేరు చేసి కాల్చి నాశనం చేయాలి.

ముందుగా సేంద్రీయ పద్ధతిలో ఆవు పేడ నీళ్లను, ద్రవ పశువుల ఎరువులను నేలపై చల్లాలి.వ్యాధి నిరోధకతను కలిగిన మేలైన రకాలను ఎంచుకొని పొలంలో విత్తు కోవాలి.పసుపు నాటుకోవడానికి ముందు విత్తన రైజోమ్లను మాంకొజెబ్ 0.3%తో 30 నిమిషాల పాటు ఉంచి ఆ తరువాత ప్రధాన పొలంలో నాటుకుంటే ఈ వేరుకుళ్ళు తెగులు నుండి పంటను దాదాపుగా సంరక్షించినట్టే.







