ప్రస్తుతం వర్షాకాలం( Rainy Season ) వచ్చి వర్షాలు బాగా పడుతున్నాయి.దీని వల్ల దోమల బెడద( Mosquitoes ) కూడా భారీగా పెరిగిపోయింది.
అలాగే వర్షాకాలంలో అంటువ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి.దీని వల్ల చిన్న పిల్లలకు, వృద్ధులకు, యువకులకు కూడా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
వర్షాకాలంలో వైరస్లు, ఇన్ఫెక్షన్లు అనేక వ్యాధులకు దారితీస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే మలేరియా,( Malaria ) డెంగ్యూ( Dengue ) జ్వరం కూడా చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది.
దీని వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది.వర్షాకాలంలో దోమలు కుట్టడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి.
ప్రమాదకరమైన దోమల ద్వారా మలేరియా డెంగ్యూ లాంటి విష జ్వరాలు వ్యాపిస్తాయి.

దీని వల్ల అధిక జ్వరం, చలి, శరీర నొప్పులు, వాంతులు వంటి అనేక ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి.డెంగ్యూ, మలేరియా వ్యాధిని కొన్ని ఇంటి నివారణ ఉపయోగించడం ద్వారా నివారించవచ్చు.ఆ ఇంటి నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలంలో అల్లం ఆరోగ్యానికి బూస్టర్ గా పనిచేస్తుంది.అల్లం లో యాంటీ బ్యాక్టీరియాల్ మరియు ఆంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి.
ఇది రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది.జ్వరం వచ్చినప్పుడు అల్లం రసం తాగడం ఎంతో మంచిది.
ముఖ్యంగా చెప్పాలంటే పసుపు పాలు వర్షాకాలంలో మంచి ఔషధం.

అలాగే వర్షాకాలంలో చాలామంది పసుపు పాలు తాగుతారు.ఇది జ్వరాన్ని దూరం చేస్తుంది.శరీరంలో వేడినీ పెంచడం ద్వారా ఇన్ఫెక్షన్లను చంపేస్తుంది.
ఈ మూలిక నొప్పిని కూడా తగ్గిస్తుంది.ఇంకా చెప్పాలంటే దాల్చిన చెక్క డిటాక్షన్ తాగండి.
మలేరియా డెంగ్యూ రోగాలకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతుంది.అలాగే ఆయుర్వేదం ప్రకారం జ్వరానికి దాల్చిన చెక్క కాషాయం అద్భుతమైన ఔషధం.
ఇంకా చెప్పాలంటే వేప ఆకులను రోజు తీసుకోవడం వల్ల అధిక జ్వరం, మలేరియా జ్వరం, డెంగ్యూ లాంటివే కాకుండా అనేక ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.దీనికి బ్యాక్టీరియా వైరస్లను చంపే గుణాలు ఎక్కువగా ఉన్నాయి.
కాబట్టి వేప చెట్టు ఆకుల రసాన్ని తాగడం కూడా ఎంతో మంచిది.