చిన్నారుల్లో( Children ) తరచుగా తలెత్తే సమస్యల్లో రక్తహీనత( Anemia ) ఒకటి.పాలు ఎక్కువగా తాగడం, టీ, కాఫీ, అధికంగా ప్రాసెస్‌డ్ ఫుడ్ తీసుకోవడం, క్రిముల ప్రభావం, పోషకాహార లోపం తదితర కారణాల వల్ల చిన్నారుల శరీరంలో హీమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోతుంది.
దాంతో రక్తహీనత బారిన పడి ఎప్పుడూ నీరసంగా కనిపిస్తుంటారు.తీవ్రమైన అలసట, గుండె వేగంగా కొట్టుకోవడం, తల తిరగడం, మట్టి తినడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు అధికంగా పట్టడం వంటి లక్షణాలు రక్తహీనత వల్ల చిన్నారుల్లో కనిపిస్తాయి.
ఈ లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పిల్లలను వైద్యులను చూపించారు.అలాగే వారి డైట్ పై ప్రత్యేక దృష్టి సారించాలి.
చిన్నారుల్లో రక్తహీనతను పోగొట్టే సూపర్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి.పాలకూర, తోటకూర, మునగాకు వంటి ఆకుకూలరను పిల్లలకు వండి పెట్టాలి.ఈ ఆకుకూరల్లో( Leafy Vegetables ) మెండుగా ఉండే ఐరన్ హీమోగ్లోబిన్( Hemoglobin ) స్థాయిని పెంచి రక్తహీనతకు చెక్ పెడుతుంది.అలాగే పిల్లలకు వారానికి కనీసం రెండు సార్లు అయినా బీట్‌రూట్, క్యారెట్ లతో జ్యూస్ తయారు చేసి ఇవ్వాలి.

కిస్మిస్, ఖర్జూరం, అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్( Dry Fruits ) ను పిల్లల చేత రోజూ తినిపించాలి.కందిపప్పు, మినుములు, శనగలు, నువ్వులు, బాదం, గుడ్లు, చేపలు, చికెన్, బొప్పాయి, క్యాబేజీ వంటి ఆహారాలు కూడా పిల్లల్లో రక్తహీనతను తరిమికొట్టడంతో తోడ్పడతాయి.అలాగే ఐరన్ శోషణలో విటమిస్ సి కీలక పాత్రను పోషిస్తుంది.అందువల్ల విటమిన్ సి అధికంగా ఉండే ద్రాక్ష, పైనాపిల్, బెర్రీలు, టమోటాలు, క్యాప్సికమ్, నిమ్మకాయ, మామిడిపండ్లు, కమలాపండ్లను పిల్లల డైట్ లో చేర్చండి.

అదే సమయంలో రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులకు వీలైనంత వరకు పాలు ఇవ్వడం తగ్గించండి.ఎందుకంటే, పాలల్లో ఉండే కాల్షియం ఐరన్‌ను పూర్తిగా ఆవిరి చేయగలదు.టీ, కాఫీ నుంచి పిల్లలను దూరంగా ఉంచండి.జంక్ ఫుడ్, శీతలపానీయాలకు నో చెప్పండి.ఇంటి ఫుడ్ నే ప్రిఫర్ చేయండి.పిల్లల రెగ్యులర్ డైట్ లో తక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ప్రోటీన్ ఉండేలా చూసుకోండి.
దాంతో వారు వేగంగా రక్తహీనత నుంచి బయటపడతారు.







