కోర్ట్ మూవీ నచ్చకపోతే హిట్3 చూడకండి.. నాని సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ హీరో నాని( Hero Nani ) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు నాని.

 Court Movie Pre Release And Trailer Launch Event Details, Court, Court Movie, To-TeluguStop.com

ప్రస్తుతం నాని ఒకవైపు హీరోగా రాణిస్తూనే మరొకవైపు నిర్మాతగా మారి సినిమాలను కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఇకపోతే నాని సమర్పణలో ప్రియదర్శి( Priyadarshi ) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ.( Court: State vs A Nobody ) ఈ సినిమాను రామ్ జగదీష్ తెరకెక్కించిన విషయం తెలిసిందే.ప్రశాంతి తిపిర్నేని నిర్మాత.

హర్ష్‌ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు.శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్ష వర్ధన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమా ఈ నెల 14 న థియేటర్లలోకి రానుంది.

Telugu Pre, Priyadarshi, Nani, Tollywood-Movie

ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్‌ వేడుకలో ఈ చిత్ర ట్రైలర్‌ ను నాని విడుదల చేశారు.దీంట్లో ఆయనతో పాటు దర్శకులు మోహన కృష్ణ ఇంద్రగంటి, నాగ్‌ అశ్విన్, ప్రశాంత్‌ వర్మ, శ్రీకాంత్‌ ఓదెల, శైలేశ్‌ కొలను, శౌర్యువ్‌ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా చిత్ర సమర్పకుడు నాని మాట్లాడుతూ.

నా 16 ఏళ్ల సినీ కెరీర్‌లో దయ చేసి ఈ సినిమా చూడండి అని నేనెప్పుడూ అడిగింది లేదు.కానీ ఈ చిత్ర విషయంలో ఆ మాట అడుగుతున్నాన.

ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులెవరూ మిస్సవ్వకూడదని నా కోరిక.అందుకే ఇంతగా బతిమలాడుతున్నా.

Telugu Pre, Priyadarshi, Nani, Tollywood-Movie

ఇది మీ అంచనాల్ని అందుకోలేదు అనిపిస్తే మరో రెండు నెలల్లో విడుదల కానున్న నా హిట్‌ 3( Hit 3 Movie ) సినిమని ఎవరూ చూడవద్దు.ఇంతకంటే బలంగా నేనేమీ చెప్పలేను.ఎందుకంటే దీనికన్నా 10రెట్లు ఎక్కువగా హిట్‌ 3 పై ఖర్చు పెట్టాను.ఈ నెల 14 వరకే ఈ సినిమా చూడమని నేను అందరికీ చెప్తా ఆ తర్వాత నుంచి మీరే ఆ మాట ప్రతి ఒక్కరికీ చెప్తారు.

ఈ రోజుల్లో సినిమాల్లోకి దూరిపోయి.అందులోని పాత్రల ఎమోషన్‌తో కనెక్ట్‌ అయిపోయి.వాటితో పాటు నవ్వి, ఏడ్చి.ఆ చిత్ర ప్రపంచాల్లోకి తీసుకెళ్లే కథలు బాగా తగ్గిపోయాయి.

కానీఅలాంటి అనుభూతిని కోర్ట్‌ తో నేను పొందగలిగాన.ఇప్పుడా అనుభూతినే ప్రేక్షకులు పొందాలన్నది నా తాపత్రయం.

అందుకే ఈ నెల 14న దయచేసి థియేటర్‌కు వెళ్లండ అనిని అడుగుతున్నా అని తెలిపారు నాని.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube