సాధారణంగా కొందరి స్కిన్ టోన్ ఈవెన్‌గా ఉండదు.ముఖ్యంగా ముఖంపై అక్కడక్కడ ముదురు రంగు మచ్చలు ఏర్పడి.
స్కిన్ టోన్ అన్ ఈవెన్‌గా మారుతుంది.దాంతో ఆయా మచ్చలను తొలగించుకుని.
చర్మపు రంగును సమానంగా మార్చుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేస్తే ఈవెన్ స్కిన్ టోన్‌ను తమ సొంతం చేసుకోవచ్చు.
మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో చూసేయండి.
ముందుగా ఒక అరటి పండు, ఒక నారింజ పండు మరియు ఒక దానిమ్మ పండు తీసుకుని.
ఆయా పండ్లకు ఉన్న తొక్కలను సపరేట్ చేసుకోవాలి.ఈ తొక్కలను ఎండలో బాగా ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనెను పోయాలి.ఆ నూనెలో మూడు టేబుల్ స్పూన్ల అరటి, దానిమ్మ, నారింజ తొక్కల పొడి వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికించుకున్న మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక.స్ట్రైనర్ సాయంతో ఆయిల్‌ను మాత్రం సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ప్యూర్ అలోవెర జెల్, తయారు చేసి పెట్టుకున్న ఆయిల్ మూడు టేబుల్ స్పూన్లు వేసి మిక్స్ చేసుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల పాటు వాడుకోవచ్చు.దీనిని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ముఖానికి అప్లై చేసి రెండు నిమిషాల పాటు స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలి.
గంట అనంతరం గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేస్తే మచ్చలు తొలగిపోయి స్కిన్ టోన్ ఈవెన్‌గా మారుతుంది.