లో బ్లడ్ షుగర్ గురించి మీకు తెలుసా

సాధారణంగా మనం షుగర్ విషయానికి వచ్చే సరికి హై బ్లడ్ షుగర్ గురించి ఎక్కువగా వింటూ ఉంటాం.కానీ ఈ మధ్య కాలంలో లో బ్లడ్ షుగర్ గురించి కూడా వింటూ ఉన్నాం.

 Low Blood Sugar Symptoms-TeluguStop.com

అసలు లో బ్లడ్ షుగర్ రావడానికి గల కారణాలను తెలుసుకుందాం.అలాగే లో బ్లడ్ షుగర్ లక్షణాలు ఎలా ఉంటాయో కూడా ఒక్కసారి తెలుసుకుందాం.

వీటి గురించి తెలుసుకుంటే కొంత జాగ్రత్త తీసుకోవచ్చు.

లో బ్లడ్ షుగర్ రావడానికి గల కారణాలు

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వలన మధుమేహం వస్తుందని తెలుసు.

అయితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించుకోవటానికి వాడే మందుల కారణంగా ఒక్కోసారి గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోయి లో బ్లడ్ షుగర్ వస్తుంది.

హెపటైటిస్, కిడ్నీ వ్యాధులు ఉన్న వారిలో కూడా లో బ్లడ్ షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కాబట్టి ఈ వ్యాధులు ఉన్నవారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి.

మలేరియా వ్యాధి నివారణకు ఇచ్చే క్వినైన్ అనే ఒక రకమైన మందు వలన కూడా లో బ్లడ్ షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఎండోక్రిన్, అడ్రినల్ గ్రంథుల్లో సమస్యలు ఉన్న సరే లో బ్లడ్ షుగర్ రావటానికి అవకాశాలు ఉన్నాయి.

లో బ్లడ్ షుగర్ లక్షణాలు
సడన్ గా మూడ్ మారిపోవటం ,తొందరగా అలసిపోవడం ,గుండె కొట్టుకొనే వేగం సడన్ గా పెరిగిపోవటం ,ఆకలి బాగా వేయటం ,చూపు మందగించటం ,ఆలోచన శక్తి తగ్గి ఏకాగ్రత లేకపోవటం వంటి లక్షణాలు ఉంటాయి.

ఈ లక్షణాలు కనపడగానే డాక్టర్ ని సంప్రదించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube