చలికాలంలో చర్మానికి సహజ మాయిశ్చరైజర్లివి.. తప్పక ట్రై చేయండి!

చలికాలం( Winter ) ప్రారంభం అయింది.ఈ సీజన్ లో ప్రధానంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో డ్రై స్కిన్ ( Dry skin )ఒకటి.

 Try These Natural Moisturizers During Winter , Natural Moisturizers , Moistu-TeluguStop.com

ఎంత ఖరీదైన మాయిశ్చరైజర్స్ రాసుకున్నప్పటికీ పదే పదే చ‌ర్మం డ్రై అవుతూనే ఉంటుంది.దీంతో దురద, చిరాకు వంటి సమస్యలు తలెత్తుతాయి.

కానీ ఇప్పుడు చెప్పబోయే సహజ మాయిశ్చరైజర్లను వాడితే మీ చర్మం రోజంతా తేమగా, కోమలంగా మెరుస్తుంది.మ‌రి ఇంకెందుకు ఆలస్యం ఆ సహజ మాయిశ్చరైజర్ల గురించి తెలుసుకుందాం పదండి.

పులియబెట్టిన పెరుగు( Curd ) ఈ చలికాలంలో మన చర్మానికి ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది.స్నానం చేయడానికి అరగంట ముందు పెరుగు తీసుకుని ముఖానికి, మెడకు, చేతులకు, కాళ్ళకు, పాదాలకు అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.

ఇలా కనుక చేస్తే మీ చర్మం రోజంతా హైడ్రేటెడ్ గా ఉంటుంది.మృదువుగా మెరుస్తుంది.

Telugu Tips, Dry Skin, Latest, Moisturizers, Skin Care, Skin Care Tips, Smooth S

అలాగే విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) ను కూడా సహజ మాయిశ్చరైజర్ గా చెప్పుకోవచ్చు.రోజు నైట్ ఈ ఆయిల్ ను చర్మానికి అప్లై చేసుకుంటే.స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది.షైనీ గా, స్మూత్ గా మారుతుంది.పొడిబారిన చర్మానికి, పెదాలకు తేమను అందించడంలో షియా బటర్ అద్భుతంగా హెల్ప్ చేస్తుంది.

Telugu Tips, Dry Skin, Latest, Moisturizers, Skin Care, Skin Care Tips, Smooth S

ఇక రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ ( Aloe vera gel )లో రెండు టేబుల్ స్పూన్ల తేనె( Honey ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు అప్లై చేసుకుని ముప్పై నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.ఆ తర్వాత వాట‌ర్ తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

అలోవెరా జెల్, తేనెలో మన చర్మానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.ప్రస్తుత ఈ చలికాలంలో చర్మాన్ని తేమగా కాంతివంతంగా ఉంచడానికి ఇవి రెండు ఉత్తమంగా సహాయపడతాయి.

పైగా చర్మంపై ఏమైనా ర్యాషెస్ ఉన్న సరే వాటిని సమర్థవంతంగా నివారిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube