కొలెస్ట్రాల్ ఎక్కువైందా.. వర్రీ వద్దు ఈ సింపుల్ టిప్స్ ను పాటిస్తే మీరు సేఫ్!

కొలెస్ట్రాల్.ఇటీవల రోజుల్లో బాగా వినిపిస్తున్న పేరు.

 Simple Tips To Lower Cholesterol!, Cholesterol, Lower Cholesterol Foods, Lifesty-TeluguStop.com

బ్లడ్ లో కొలెస్ట్రాల్( Cholestrol )( స్థాయిలు పెరిగే కొద్దీ గుండెకు ముప్పు పెరుగుతుంది.అందుకే ఆరోగ్య నిపుణులు కొలెస్ట్రాల్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలని పదే పదే చెబుతుంటారు.

అయినా సరే చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.ఫలితంగా అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు.

ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.మీకు కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని డాక్టర్లు చెప్పారా.? వర్రీ వద్దు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ను పాటిస్తే మీరు సేఫ్.ఈ టిప్స్ ద్వారా కొలెస్ట్రాల్ ను సమర్థవంతంగా అదుపులోకి తెచ్చుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Cholesterol, Tips, Lifestyle-Telugu Health

సాధారణంగా ఉదయం లేవగానే ప్రతి ఒక్కరికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది.కానీ వాటికి బదులుగా గ్రీన్ టీ లేదా ఏదో ఒక హెర్బల్ టీ( Herbal Tea ) ను తయారు చేసుకుని తీసుకోండి.హెర్బల్ టీలు కొలెస్ట్రాల్ ను కరిగించడానికి చాలా అద్భుతంగా సహాయపడతాయి.

అదే సమయంలో బాడీని డీటాక్స్ చేస్తాయి.

బిజీ లైఫ్ స్టైల్ కారణంగా రోజు మార్నింగ్ బ్రెడ్ తిని ఆఫీసుకు వెళ్లే వారు ఎంతోమంది ఉన్నారు.

అయితే వైట్ బ్రెడ్ ను మాత్రం తీసుకోకండి.వైట్ బ్రెడ్ లో ఉండే కార్బోహైడ్రేట్స్, షుగర్స్ మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను భారీగా పెంచేస్తాయి.

అందుకే వైట్ బ్రెడ్ కు బదులుగా బ్రౌన్ బ్రెడ్ ను ఎంచుకోండి.అలాగే ఓవర్ నైట్ ఓట్స్, గుడ్లు, ప్రోటీన్ స్మూతీలు వంటివి బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోండి.

ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కంట్రోల్ లోకి తెచ్చేందుకు హెల్ప్ చేస్తాయి.అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు షుగర్ ని పూర్తిగా అవాయిడ్ చేయండి.

బెల్లం, తేనె లాంటిది వాడండి.

Telugu Cholesterol, Tips, Lifestyle-Telugu Health

అలాగే ఫ్యాట్ లెస్ మిల్క్( Fatless Milk ) ని ఎంచుకోండి.బాదం పాలు, సోయా పాలు వంటి ప్రిఫ‌ర్ చేస్తే ఇంకా మంచిది.డైట్ లో తాజా కూరగాయలు, ఆకుకూరలు, నట్స్, మొలకెత్తిన విత్తనాలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, అల్లం, వెల్లుల్లి, సీజనల్ పండ్లు ఉండేలా చూసుకోవాలి.

నిత్యం 30 నిమిషాలు వాకింగ్, రన్నింగ్ ఇలా ఏదో ఒక వ్యాయామం చేయండి.ధూమపానం, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి.అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.కంటి నిండా నిద్ర ఉంటే ఆల్మోస్ట్ 90% జబ్బులకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube