ఈ మధ్యకాలంలో చాలామంది తమ పిల్లలకు వివిధ రకాల డైపర్లు ( Diapers)వాడుతున్నారు.తమ పిల్లలు మూత్రం, మలవిసర్జన చేస్తే ఈజీగా చేంజ్ చేయవచ్చని డైపర్లను ఎక్కువగా వాడుతున్నారు.
అయితే ఒకప్పుడు గతంలో బిడ్డ ఎన్నిసార్లు మలమూత్రం చేసిన కూడా అన్నిసార్లు కచ్చితంగా నీటితో శుభ్రం చేసే వాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ఆ తిప్పలు లేకుండా డైపర్ లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.శిశువుకు డైపర్ వేసి బయటికి వెళ్లేటప్పుడు చాలా సౌకర్యంగా ఉంటుందని ఈ విధానాన్ని ప్రతి తల్లులు ఎంచుకుంటున్నారు.
అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే డైపర్ ఎలా చేస్తారు? ఏ విధంగా చేస్తారు? ఎందుకంటే డైపర్ ని వేసే పద్ధతి వల్ల కూడా పిల్లల ఆరోగ్యానికి కారణం అవుతుంది.పూర్వకాలంలో పిల్లలకు కాటన్ క్లాత్ ( Cotton cloth )తో తయారు చేసిన లంగోటీలు వేసేవారు ఇవి త్రిభుజాకారంలో ఉంటాయి.
అయితే ఇప్పుడు కూడా కొన్ని చోట్ల వీటినే కొంతమంది వాడుతున్నారు.పిల్లలు వీటిలో మలమూత్ర విసర్జన చేసిన కూడా వాటిని శుభ్రం చేసి మళ్లీ ఉపయోగించేవారు.

ఈ కాటన్ క్లాత్ చాలా మెత్తగా ఉన్నప్పటికీ పిల్లలు మూత్రం, మలం చేసినప్పుడు బయటకు వచ్చేవి.అలా బయటికి రాకుండా ఉండేందుకు ప్రస్తుత కాలంలో గంటలు,గంటలు డైపర్లు వేసి అలాగే ఉంచేస్తున్నారు.ఇక డైపర్ నిండిన తర్వాత వాటిని తొలగిస్తారు.రెండు, మూడు ఏళ్ల పిల్లలకు కూడా డైపర్లు వేస్తున్నారు.అయితే పిల్లలు మలమూత్ర విసర్జన చేసినప్పుడు ఒక్కసారికైనా నీటితో శుభ్రం చేయడం చాలా ముఖ్యం.కానీ డైపర్ నిండినంతవరకు అలాగే పెట్టడం వల్ల పిల్లలకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్( Urinary tract infection) వచ్చే ప్రమాదం ఉంది.

అలాగే మలమూత్ర విసర్జన చేసినప్పటికీ అలాగే ఉంచడం వల్ల అసిడిక్ ఆల్కలీం బ్యాక్టీరియా కలిసిపోయి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.అంతేకాకుండా డైపర్ ఎక్కువసేపు ఉంచడం వల్ల చర్మం దెబ్బతిని దద్దుర్లు వస్తాయి.అందుకే ఈ విషయంలో వైద్యులు పిల్లలకు డైపర్ వేసే ముందు ఆయిల్ లేదా మరేదైనా క్రీమ్ పూసి మాయిశ్చరైజింగ్ చేయాలని సూచిస్తున్నారు.అలాగే పిల్లలు ఏడిస్తే వెంటనే డైపర్ ని తీసేయాలని చెబుతున్నారు.