ముఖ చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోతూ కనిపించాలని చాలా మంది కోరుకుంటారు.అటువంటి చర్మాన్ని పొందడం కోసం రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు.
అయితే సహజంగా కూడా సూపర్ బ్రైట్ స్కిన్ ను మీ సొంతం చేసుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే కాఫీ మాస్క్( Coffee Mask ) చాలా అంటే చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
మాస్క్ తయారీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్,( Coffee Powder ) వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్,( Corn Flour ) వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి.ఆ తర్వాత ఒక కప్పు వాటర్ పోసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పై ఈ గిన్నెను పెట్టి దాదాపు ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించారంటే స్మూత్ క్రీమ్ రెడీ అవుతుంది.ఈ క్రీమ్ ను చల్లారపెట్టుకోవాలి.
పూర్తిగా కూల్ అయ్యాక అందులో వన్ టీ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ లేదా అవిసె గింజల జెల్ వేసుకుని బాగా కలుపుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటే వారం రోజులపాటు వాడుకోవచ్చు.ఇక ముఖంపై ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

వారానికి రెండుసార్లు ఈ కాఫీ మాస్క్ ను కనుక వేసుకున్నారంటే స్కిన్ అనేది టైట్ గా మరియు సూపర్ బ్రైట్ గా మారుతుంది.చర్మంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.మొండి మచ్చలు ఏమైనా ఉంటే క్రమంగా మాయం అవుతాయి.
చర్మం స్మూత్ గా, స్పాట్ లెస్ గా మారుతుంది.పైగా ఈ కాఫీ మాస్క్ తరచూ వేసుకోవడం వల్ల స్కిన్ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
పిగ్మెంటేషన్ సమస్య వచ్చే రిస్క్ తగ్గుతుంది.మరియు చర్మం యవ్వనంగా కూడా మారుతుంది.