డార్క్ అండర్ ఆర్మ్స్ ను వైట్ అండ్ స్మూత్ గా మార్చే రెమెడీ మీకోసం..!

టైట్ దుస్తులు( Tight clothing ) ధరించడం, చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోవడం, ఒంట్లో అధిక వేడి, చెమట, బ్యాక్టీరియా, సరిగ్గా గాలి ఆడక పోవడం తదితర కారణాల వల్ల చాలా మందికి అండర్ ఆర్మ్స్ అనేవి నల్లగా అసహ్యంగా కనిపిస్తుంటాయి.డార్క్ అండర్ ఆర్మ్స్( Dark underarms ) విషయంలో ఆడవారు బాగా వర్రీ అవుతుంటారు.

 A Remedy For Making Your Underarms White And Smooth! Underarms, Underarms Whiten-TeluguStop.com

త‌మ‌కు ఎంతో ఇష్ట‌మైన స్లీవ్ లెస్ దుస్తులు వేసుకోవడానికి సంకోచిస్తుంటారు.అయితే ఇకపై ఆ ప్రాబ్లం అక్కర్లేదు.

ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీతో చాలా సులభంగా మరియు వేగంగా వైట్ అండ్ స్మూత్ అండర్ ఆర్మ్స్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

అందుకోసం ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి( Multani mitti ) వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్( Muleti powder ), పావు టీ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ( Apple cider vinegar )మరియు సరిపడా వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Telugu Remedyunderarms, Tips, Remedy, Skin Care, Skin Care Tips, Underarms-Telug

ఫైనల్ గా తడి లేకుండా తుడుచుకుని మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ అప్లై చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ హోమ్ రెమెడీని కనుక పాటించారంటే కేవలం మూడు వారాల్లోనే మీరు రిజల్ట్ ను గమనిస్తారు.ఈ రెమెడీ అండర్ ఆర్మ్స్ లో నలుపును క్రమంగా వదిలిస్తుంది.

అక్కడి చర్మాన్ని తెల్లగా మృదువుగా మారుస్తుంది.వైట్ అండ్ స్మూత్ అండర్ ఆర్మ్స్ ను కోరుకునే వారికి ఈ రెమెడీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

పైగా ఈ రెమెడీని మెడ నలుపు, మోకాళ్లు-మోచేతుల నలుపు వదిలించుకునేందుకు కూడా ఉపయోగించవచ్చు.కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube