విమాన వెంకటేశ్వర స్వామి ఎవరో మీకు తెలుసా?

చాలా మందికి వెంకటేశ్వర స్వామి గురించి తెలుసు.ఆయనను బాలాజీ అని ఏడు కొండల వాడని శ్రీనివాసుడని పిలుస్తుంటారు.

 Do You Know Who Is Vinama Venkateshwara Swamy , Vinama Venkateshwara Swamy, Venk-TeluguStop.com

అయితే ఈ విషయం అందరికీ తెలిసిందే.చాలా మంది తిరుమలకు వెళ్తే కేవలం ఆ తిరుమలేశుడి దర్శనం మాత్రమే చేసుకుని వచ్చేస్తారు.

కానీ తిరుమలలో దర్శించుకోదగ్గ దేవతా మూర్తులు, చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉంటాయి.కానీ చాలా మందికి విమాన వెంకటేశ్వర స్వామి గురించి తెలియదు.

అయితే ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయనకు వెంకటేశ్వర స్వామికి సంబంధం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ  వేంకటేశ్వర స్వామి ఆలయంపై ఉన్న ఆనంద నిలయం గురించి మన అందరికీ తెలిసిందే.

అయితే ఆ విమానంపై విలసిల్లే ఆ వెంకటేశ్వర మూర్తినే విమాన వెంకటేశ్వర స్వామి అంటారు.అయితే విమానంపై వాయువ్య దిశలో మకర తోరణంచే అలంకరింపబడిన ఒక చిన్న మందిరం కనిపిస్తుంది.

అందులో ఉన్న మూర్తియే విమాన వెంకటేశ్వర స్వామి.

ఇది మూల విరాఠ్ మూర్తిని పోలి ఉంటుంది.

అయితే అన్న ప్రమాణాన్ని బట్టి తొండమాన్ రాజు ఈ మూర్తిని విమానంపై ఏర్పాటు చేశాడని వేంకటాచల మహత్యం నిర్దేశిస్తోందని భక్తుల విశ్వాసం.అంతే కాదండోయ్ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని ప్రశస్తి.

అలాగే అష్ట ఐశ్వర్యాలు సిద్ధించడంతో పాటు మనసంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందట విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే.అందుకే చాలా మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత కచ్చితంగా విమాన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube