వాస్తు ప్రకారం సీతాఫలం చెట్టు ఇంట్లో పెంచవచ్చా!

మన భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో, అలాగే వాస్తు శాస్త్రానికి కూడా అంతే ప్రాముఖ్యతనిస్తారు.ఇంట్లో ఏదైనా చిన్న పని నుంచి మొదలుకొని పెద్ద పని వరకు ప్రతి ఒక్కటి వాస్తుపరంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు.

 Custard Apple Tree Before Home, Vasthu Principles, Custard Apple, Home, Hindhu R-TeluguStop.com

అయితే చెట్లను పెంచే విషయంలో కూడా ఈ వాస్తు పద్ధతిని పాటించడం విశేషమని చెప్పవచ్చు.వాస్తు ప్రకారం కొన్ని చెట్లు మన ఇంట్లో పెంచడం ఎంతో మంచిదని, మరికొన్ని చెట్లను పెంచే కూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతుంటారు.

అయితే సీతాఫలం చెట్టు ఇంటి ఆవరణలో పెంచవచ్చా? లేదా ?అనే సందేహం చాలామందికి కలుగుతుంది.శాస్త్రం ప్రకారం సీతాఫలం చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చా లేదా అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం…

వాస్తు ప్రకారం మన ఇంటి ఆవరణంలో పెద్దపెద్ద వృక్షాలను నాటకూడదు అని చెబుతుంటారు.

అలా పెద్ద వృక్షాలను నాటడం వల్ల మన ఇంట్లోకి గాలి, వెలుతురు లేకుండా మన ఇంట్లో ఎప్పుడూ ప్రతికూల వాతావరణాన్ని ఏర్పరుస్తాయి అందుకోసమే పెద్ద చెట్లను ఇంటి ఆవరణంలో పెంచకూడదు అని చెబుతుంటారు.అదేవిధంగా ముళ్ళు ఉన్న (బ్రహ్మజముడు, రేగు చెట్టు) వంటి చెట్లను ఇంటి ఆవరణంలో పెంచకూడదు వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం సీతాఫలం చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చా అంటే… పెంచుకోకూడదు అనే వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.సీతాఫలం చెట్టును ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని తెలియజేస్తున్నారు.ఒకవేళ మన ఇంటి ఆవరణంలో సీతాఫలం చెట్టు ఉంటే దానిని నరికి వేయకుండా, సీతాఫలం చెట్టు పక్కనే ఉసిరి చెట్టు లేదా అశోక చెట్టును అదే పరిధిలో పెంచితే వాస్తు దోషం తొలగిపోతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.కానీ ఈ సీతాఫలాలతో లక్ష్మీ దేవిని పూజించడం వల్ల అష్టదరిద్రాలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలను చేకూరుస్తుంది.

సీతాఫలం ఆధ్యాత్మికంగా ఎంతో మంచి ఫలితాలను ఇవ్వడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందని చెప్పవచ్చు.అయితే సీతాఫలం చెట్టు మాత్రం వాస్తు ప్రకారం మన ఇంటి ఆవరణంలో ఉండకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు.

Custard Apple Tree Before Home, Vasthu Principles, Custard Apple, Home, Hindhu Rituals, Hindhu Trust - Telugu Cud Apple, Rituals

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube