ముక్కోటి ఏకాదశి సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలోని జిల్లా కళ్ళకురిచ్చీ జిల్లా చిన్న సేలం నగరంలోని 200 సంవత్సరాల నాటి వరదరాజా పెరుమాళ్ దేవాలయంలోకి దళిత వర్గాలకు చెందిన ప్రజలు తొలిసారి ప్రవేశించి దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించారు.దాదాపు రెండు వందల సంవత్సరాల నుంచి పెరుమాళ్ దేవాలయంలోకి దళిత వర్గాలకు చెందిన ప్రజలకు ప్రవేశం లేదు.
కొన్ని సంవత్సరాలుగా అనేక నిరాసనల తర్వాత కూడా వారు తమ ప్రార్థనలు చేసుకోవడానికి ఏ ప్రభుత్వం కూడా అనుమతించలేదు.అయితే జిల్లా కలెక్టర్ శ్రవణ్ కుమార్ తో పాటు మరో అధికారి హిందూ మతా మరియు ధర్మాదాయ శాఖ నుంచి ఆదేశాలు అందుకొని షెడ్యూలు కులాలను దేవాలయంలోకి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.
దీనివల్ల సోమవారం పవిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా గ్రామంలోని దళితులు అధికారులతో కలిసి దేవాలయ ప్రవేశం చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 300 మంది పోలీసులను భద్రతగా ఏర్పాటు చేశారు.
గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో ఆలయంలోకి ప్రవేశించి ప్రార్థనలను ఎంతో వైభవంగా, ఘనంగా నిర్వహించారు.గత పది రోజుల్లో తమిళనాడులోని ఇలాంటి ఘటన జరగడం ఇది రెండవ సారి.
అంతకు ముందు పుదుకోట్టైలోని వెంగైవాయల్ గ్రామంలోని అయ్యనార్ దేవాలయానికి షెడ్యూల్డ్ కులాల ప్రజలను కలెక్టర్ కవిత రాముతో పాటు ఇతర అధికారులు తీసుకెళ్లారు.

దళితుడైన పి రమేష్ కుమార్ మాట్లాడుతూ ఈ దేవాలయం సుమారు 200 సంవత్సరాల నాటిది.దళితులను దేవాలయంలోకి రానీయకుండా మొదటి నుంచి నిషేధించారు.మమ్మల్ని అనుమతించమని గ్రామంలోని కుల హిందువులను మేము పదేపదే విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాము.కానీ వారు నిరాకరిస్తూ వస్తున్నారు.2008లో దేవాలయ ఊరేగింపును తాత్కాలికంగా నిలిపివేశారు కూడా.మేము ఇప్పుడు మా జీవితంలో మొదటిసారిగా దేవాలయంలోకి ప్రవేశిస్తున్నాము.మా విజ్ఞప్తిని అంగీకరించినందుకు జిల్లా యంత్రాంగం మరియు పోలీసులకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నామని చెబుతున్నారు.