మన దేశవ్యాప్తంగా ఎన్నో పురాతన దేవాలయాలు చాలా ప్రసిద్ధి చెంది ఉన్నాయి.ఈ ఆలయాలకు ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు భారతదేశంలో ఉన్న దేవాలయాలలో ఒక్కొక్క దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది అదేవిధంగా చంబల్ లో ఉన్న అచలేశ్వర్ మహాదేవ్ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది.
రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లా మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉంది.ఈ దేవాలయం వేల సంవత్సరాల నాటిదని అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు చెబుతూ ఉంటే, 1875 కాలం నాటిదని మరి కొంతమంది భక్తులు చెబుతున్నారు.
అప్పట్లో చంబల్ లోయ మొత్తం దొంగల అధీనంలో ఉండేదని అందుకే ఎవ్వరూ అటువైపు వెళ్లేందుకు సాహసించేవారు కాదని అక్కడి కొంతమంది ప్రజలు చెబుతున్నారు.
మనదేశంలో ఉన్న పురాతన శివాలయాలలో అచలేశ్వర మహాదేవ మందిరం కూడా ఒకటి.
ఈ దేవాలయానికి దాదాపు 2500 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది.ఇక్కడ గర్భగుడిలోని శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
ఈ శివలింగం ఉదయం ఎరుపు వర్ణంలో, మధ్యాహ్నం కాషాయ రంగులో, సాయంత్రం కాలం ఈ శివలింగం నలుపు రంగులోకి మారిపోతుంది.ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ శివలింగం పక్కకు కదులుతూ ఉంటుంది.
ఈ అద్భుతమైన శివలింగాన్ని దర్శించుకోవడానికి ప్రతి రోజు భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.

ఈ శివాలయంలో ఉన్న ఇత్తడితో తయారుచేసిన నంది మరొక ప్రత్యేక ఆకర్షణ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ నందిని పంచలోహాలతో తయారు చేశారని అక్కడ ఉన్న అర్చకులు చెబుతూ ఉంటారు.ఈ శివాలయంలోని శివలింగం రంగులు మార్చడం, కదలడం వెనుక ఉన్న కారణాలను ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా కనుగొనలేకపోయారు.
ఈ అద్భుత రహస్యాన్ని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కనుగొనలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.అంత మహిమగల ఆలయం అయినప్పటికీ అప్పట్లో దొంగల ఆధీనంలో ఉండడం వల్ల భక్తులు వెళ్లేందుకు సాహసించలేదు.
సరైన మార్గం లేకపోవడం వల్ల అక్కడికి ఎవరూ వెళ్లేవారు కాదు.కానీ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి తెలిసి నిదానంగా భక్తులు వెళ్లడం మొదలుపెట్టారు.