ఉగాది పండుగ( Ugadi Festival )ను ప్రజలు ఏప్రిల్ 9వ తేదీన జరుపుకుంటారు.అలాగే తెలుగు ప్రజల నూతన సంవత్సరం కూడా ఉగాది రోజే మొదలవుతుంది.
శుక్ల పాడ్యమి రోజున ప్రారంభమయ్యే సృష్ఠి నిర్మాణం.అలాగే చిగురించిన చెట్లు, కోయిల కూతలు ఈ ఋతువు ప్రత్యేకత అని నిపుణులు చెబుతున్నారు.
కాగా షడ్రుచులతో కూడిన పచ్చడి( Ugadi Pachadi )ని తయారు చేసి, జీవితానికి చిహ్నంగా గుర్తించడం, భగవంతునికి సమర్పించి అన్ని సమయాలలో తమకు పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వమని పూజించడం జరుగుతుంది.

అయితే ఈ పచ్చడిని ఎలా చేస్తే మన ఇంట్లో సిరి సంపదలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.పూర్వ కాలంలో కుమ్మరి ఇంటికి వెళ్లి కొత్త కుండను కొనడం ఆనవాయితీగా ఉండేది.దాన్ని ఇంటికి తీసుకొచ్చి మామిడి తోరణాలు చుట్టి, పసుపు కుంకుమతో ముస్తాబు చేసేవారు.
ఆ తర్వాత కొత్త చింతపండును అందులో నానబెట్టి, కాస్త బెల్లం కలిపేవారు.ఇంకా చెప్పాలంటే వేప పూత, మామిడి ముక్కలు, కాసింత ఉప్పు, కారం కూడా కలిపి ఉంచేవారు.
ఆ తర్వాత ఈ పచ్చడిని మోదుగాకు డొప్పలో పోసి భగవంతునికి నైవేద్యంగా పెట్టేవారు.

అలాగే ఇలా చేసి శుభం జరగాలని కోరుకునేవారు.ఆ తర్వాత కుటుంబ సభ్యులు అందరూ దీన్ని సేవించి పెద్ద వారి నుంచి చిన్న పిల్లలు ఆశీస్సులు పొందేవారు.ముఖ్యంగా చెప్పాలంటే రైతులు పొలం దగ్గర నూతన కార్యక్రమాలకు నాంది పలుకుతారు.
అలాగే సాయంత్రం పూజారి దగ్గరకు వెళ్లి పంచాంగం చూపించమని, భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకునేవారు.ఉగాది రోజు నూతన సంవత్సరం మొదలవుతుంది.కాబట్టి ఈ రోజు ఏదైనా మంచి పనులు చేస్తే దీని ప్రభావం సంవత్సరం అంతా ఉంటుందని పండితులు చెబుతున్నారు.అందుకోసమే ఈ రోజు చాలా మంది ప్రజలు మంచి మంచి పనులు చేస్తారు.