Vijay Devarakonda : అన్ని బాగానే ఉన్నాయ్ కానీ ఈ మైనస్ పరిస్థితి ఏంటి చెప్పు విజయ్

తాజాగా థియేటర్లలో సందడి చేస్తుంది విజయ్ దేవరకొండ( vijay devarakonda ) మరియు సమంత నటించిన ఖుషి మూవీ.( Khushi ) దాదాపు చాలా రోజులుగా ఇండస్ట్రీలో సరైన సినిమాలు లేవు.

 Khushi Movie Minus Points-TeluguStop.com

జైలర్ సినిమా( Jailer movie ) తర్వాత మరో సినిమా ఎప్పుడు విడుదలవుతుందా ? హిట్ అవుతుందా అని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సమయంలో విజయ్ దేవరకొండ సినిమా యావరేజ్ కన్నా కాస్త ఎక్కువగా ఉందనే టాక్ రావడంతో ఆ సినిమాకు కలెక్షన్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది.

అయితే అసలు సినిమాలో చూడడానికి అనేక విషయాలు ఉన్నప్పటికీ లోగుట్టుగా ఉన్న ఈ మైనస్ పాయింట్స్ కూడా ప్రతి ఒక్కరూ సినిమా చూసేముందే తెలుసుకుని తీరాలి.అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.సమంత

Telugu Arjun Reddy, Jailer, Khushi, Samantha, Tollywood-Movie

ఈ సినిమాకు సమంత( samantha ) నిజంగానే ఒక మైనస్ పాయింట్.ఎందుకంటే ఆమె విజయ్ దేవరకొండ నటన ముందు తేలిపోయింది.అందంలో కూడా విజయ్ చాలా చక్కగా ఫ్రెష్ లుక్ తో కనిపించాడు.కానీ సమంత మాత్రం పేలవమయిన మొహంతో కనిపించడం బట్టి చూస్తే ఆమె ఇంకా అనారోగ్యంతోనే ఉంది అనే విషయం కన్ఫర్మ్ అవుతుంది.

ఫైట్స్ .

Telugu Arjun Reddy, Jailer, Khushi, Samantha, Tollywood-Movie

ఇంత క్యూట్ లవ్ స్టోరీ లో అవసరానికి మించి ఫైట్స్ ఉండటమే ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది.సినిమా చూస్తున్నంత సేపు బాగానే ఉన్నప్పటికీ ఎందుకో ఈ ఫైట్ లేకపోతే బాగుండేది అనే ఫీలింగ్ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కలిగింది.డ్యూరేషన్స్వానికి సినిమా కాస్త సీరియల్ సాగింది అనే మాట కూడా వినిపిస్తోంది.

ఈ చిత్రాన్ని ఒక 20 నిమిషాల వరకు నిడివి తగ్గించి ఉండి ఉంటే మరో లెవెల్ లో ఉండేది అని కొందరి అభిప్రాయం.ఇది మాత్రమే కాదు సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న హ్యూమర్ పండలేదు, అంతకు మించి ఎలాంటి ఎమోషన్స్ కూడా వర్కౌట్ అవలేదు.

అర్జున్ రెడ్డి సినిమా( Arjun Reddy )లో లాగా ఏదో ఇది నా పిల్ల అని చెప్పే ప్రయత్నం చేశారు కానీ అది కూడా వర్కౌట్ అయినట్టుగా కనిపించలేదు.పైగా ఈ సినిమాకి ఖుషి అనే ఒక క్లాసిక్ సినిమా పేరు పెట్టడం కూడా ఒక మైనస్ పాయింట్ ఏ కోశాన్న సినిమా ఆ రెంజ్ హిట్ అయితే కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube