ప్రస్తుతం కంటికి కనిపించకుండా చాప కింద నీరులా ప్రపంచదేశాల్లోనూ విస్తరిస్తున్న కరోనా వైరస్.ఎప్పడు నాశనం అవుతుందో ఊహించలేకపోతున్నారు.
ఈ మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో.ప్రజలు కరోనాతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ఇక ఈ ప్రాణాంతక మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే.శరీర రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ పవర్) పెంచుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు.
దీంతో ప్రజలు రోగ నిరోధక శక్తి పెంచుకునే ప్రయత్నంలో పడ్డారు.అయితే లవంగం టీ తాగడం వల్ల కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ లవంగాల్లో పుష్కలంగా ఉంటాయి.అందుకే లవంగం టీ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు.
జలుబు, ఫ్లూ, తలనొప్పి వంటి సమస్యలు కూడా దూరం అవుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఇక లవంగం టీ ద్వారా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
జ్వరంతో బాధపడుతున్న వారు.తక్కువ మోతాదులో లవంగం టీని రోజులో ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గించి.జ్వరం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
అలాగే మధుమేహం సమస్యతో బాధపడేవారికి లవంగం టీ మంచి ఔషధంలా పని చేస్తుంది.రోజుకో కప్పు లవంగం టీ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
లవంగం టీ తాగడం వల్ల మరో అద్భుతమైన ప్రయోజనం ఏంటంటే.రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది.అలాగే శరీరంలో భయంకరమైన కేన్సర్ కణాలు వృద్ధి చెందకుండా రక్షించడంలోనూ లవంగం టీ ఉపయోగపడుతుంది.ప్రతి రోజు ఒక కప్పు లవంగం టీ తాగడం వల్ల మలబద్దకం, జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.
కడుపు నొప్పి వచ్చినప్పుడు కూడా లవంగం టీ తాగితే.మంచి ఉపశమనం లభిస్తుంది.