ద్వాపర యుగంలో విష్ణువు, కృష్ణుడి రూపంలో భూమిపై జన్మించాడు.అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మాన్ని రక్షించడానికి ఎన్నో రకాల కృషి కూడా చేశాడు.
ఇక మనిషి ధర్మం కోసం జీవించాలని శ్రీకృష్ణుడి గీతలు అర్జునుడికి వివరించాడు.అంతేకాకుండా మనిషి తన జీవితాన్ని ఎలా గడపాలో పూర్తి జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు.
అలాంటి శ్రీకృష్ణుడికి( Sri Krishna ) సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.నరకాసురుడు చాలా మంది రాజులను ఓడించాడు.
అలా ఓడించి వారి కుమార్తెలను బంధించి, ఆ 16,000 మంది గోపికలను జైల్లో పెట్టాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా పెద్ద యుద్ధం చేసి నరకాసురుడిని( Narakasura ) సంహరించాడు.
ఆ తర్వాత 16 వేల మంది గోపికలను చెర నుండి విడిపించాడు.అయితే అప్పటికే నరకాసుడు చాలామంది బాలికల కుటుంబాలను చంపాడు.
ఇక మిగతా బాలికల కుటుంబ సభ్యులు వారు ఇంటిలోనికి రావడానికి నిరాకరించి వారిని అలాగే విడిచిపెట్టారు.అప్పుడు ఆ అమ్మాయిలందరూ శ్రీకృష్ణ భగవానుని అభ్యర్థించారు.

మీరు మా ప్రాణాలను కాపాడారు, కానీ ఇప్పుడు మేము ఒంటరిగా ఎక్కడికి వెళ్తాము అని శ్రీకృష్ణుడికి వేడుకున్నారు.దీంతో శ్రీకృష్ణుడు ఆ అమ్మాయిలందరి గౌరవాన్ని కాపాడడానికి 16 వేల రూపాలలో కనిపించి వారిని వివాహం( Marriage ) చేసుకున్నారు.సాధారణంగా అయితే శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది రాణులు ఉన్నారు.వారి పేర్లు రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, సత్య భద్ర, లక్ష్మణ.

ఈ ఎనిమిది మంది శ్రీకృష్ణుడి యొక్క ముఖ్య రాణులు అని పురాణాలు చెబుతున్నాయి.అయితే చాలామంది శ్రీకృష్ణుడికి ఇంతమంది భార్యలు ఉండడం వెనుక ఎన్నో రకాల కథలు చెబుతూ ఉంటారు.కానీ వాస్తవానికి ఇప్పుడు చెప్పిన కథ నిజమైనది.కృష్ణుడు కేవలం ఆ అమ్మాయిలకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి మాత్రమే వివాహం చేసుకున్నాడు.అదేవిధంగా శ్రీకృష్ణుడు ఆ అమ్మాయిల బాధ్యతలను పూర్తి చేయడానికి మాత్రమే ఆ 16 వేల మంది గోపికలను పలు రూపాలలో కనిపించి కృష్ణుడిగా కాకుండా, వేరే రూపాలలో ఆ అమ్మాయిలను వివాహం చేసుకున్నాడు.
LATEST NEWS - TELUGU