1.కొమరం భీం జిల్లాలో పెద్దపులి సంచారం
కొమరం భీం జిల్లాలోని కాగజ్నగర్ మండలం వేంపల్లి అనుకోడ గ్రామ శివారులలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది.
2.సిట్ నోటీసులపై హైకోర్టులో బిజెపి లంచ్ మోషన్ పిటిషన్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు సీట్ నోటీసులపై బిజెపి హైకోర్టును ఆశ్రయించింది.బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
3.కవితపై జీవన్ రెడ్డి కామెంట్స్
గత పార్లమెంట్ ఎన్నికల్లో కవితకు వెన్నుపోటు పొడిచింది సొంత పార్టీ ఎమ్మెల్యేలేనని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్ చేశారు.
4.కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ
గాంధీ భవన్ లో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు.
5.కువైట్ లో భారత రాయబారి నియామకం
కువైట్ లో భారత రాయబారిగా ఆధర్స్ స్వైకా నియమితులయ్యారు.
6.కేరళలో ఏవి అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా
కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శబరిమల నుంచి తిరిగి వస్తున్న ఏపీ అయ్యప్ప స్వామి భక్తుల బస్సు బోల్తా పడింది.ఈ ఘటనలో 15 మందికి పైగా యాత్రికులు గాయపడ్డారు.
7.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.స్వామివారి దర్శనం కోసం నేడు 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
8.కొడాలి నాని కి అనారోగ్యం
ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆసుపత్రి పాలయ్యారు.కిడ్నీ సంబంధిత సమస్యతో ఆయన బాధపడుతూ ఉండడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.
9. కవితపై విజయశాంతి ఆగ్రహం
నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసం పై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడడం తో అరవింద్ నివాసాన్ని బిజెపి నేత విజయశాంతి పరిశీలించారు.కవిత వీధి రౌడీలా మాట్లాడుతుందని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
10.షర్మిల కామెంట్స్
పథకాల పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ గారడీ చేస్తున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
11.వీక్లీ రైళ్ల పొడిగింపు
ప్రయాణికుల రద్దీ మేరకు వేరువేరు ప్రాంతాలకు వీక్లీ రైళ్ళను పొడగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
12.నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ కే టి పి ఎస్ ఏడో దశలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
13.అరవింద్ ను చెప్పతో కొడతా : కవిత
తన గురించి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే చెప్పుతో కొడతా అంటూ నిజామాబాద్ బిజెపి ఎంపీ అరవింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
14.మస్కట్ లో యాదాద్రీసుడి కళ్యాణం
మస్కట్ లో తొలిసారిగా యాదగిరిగుట్ట పండితులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణాన్ని జరిపించారు.
15.ఖమ్మంలో టిడిపి బహిరంగ సభ
ఖమ్మంలో త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ టిడిపి నిర్ణయించింది.
16.గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 7న చలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
17.డీజీపీని నివేదిక కోరిన గవర్నర్
నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన ఘటనపై సమగ్ర నివేదిక అందజేయాలని తెలంగాణ డీజీపీ ని గవర్నర్ తమిళసై సౌందర రాజన్ కోరారు.
18.ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు
బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకట రమణ తెలిపారు.
19.బాసర లో విద్యార్థుల ఫీజులో 40 శాతం రాయితీ
ప్రభుత్వ స్కాలర్ షిప్ కు అర్హత లేని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఫీజులో 40 శాతం మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -48,600 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -53,020
.