అమెరికాలో( America ) జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన భారతీయ విద్యార్ధిని కుటుంబం ఆమెను చూడటానికి తమకు అత్యవసర వీసాను మంజూరు చేయాల్సిందిగా కోరుతోంది.మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన నీలం షిండే( Neelam Shinde ) అనే విద్యార్ధిని అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న నీలం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.తమ బిడ్డను చూసేందుకు అమెరికా వీసాను మంజూరు చేయాల్సిందిగా వారు కోరుతున్నారు.
దీనిపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే ( Congress MP Supriya Sule )సోషల్ మీడియాలో ఈ అంశాన్ని లేవనెత్తారు.భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌ను ఈ విషయం పరిశీలించి నీలం కుటుంబానికి సాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఫిబ్రవరి 14న కాలిఫోర్నియాలో( California ) జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నీలం కోమాలో ఉన్నారని.ప్రస్తుతం ఆమె పరిస్ధితి విషమంగా ఉందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.వాహనం ఢీకొట్టడంతో ఆమెకు తల, ఛాతీలో తీవ్రగాయాలు అయ్యాయి.ఫిబ్రవరి 16న ప్రమాదం గురించి నీలం తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు.దీంతో అమెరికా వెళ్లేందుకు వారు అత్యవసర వీసాకు దరఖాస్తు చేసుకోగా.ఇంత వరకు మంజూరు కాలేదని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
ప్రమాదం జరగడానికి రెండ్రోజుల ముందు చివరిసారిగా నీలం తన తండ్రి, సోదరుడితో ఫిబ్రవరి 12న మాట్లాడారు.

ప్రమాదం గురించి ఆసుపత్రి, నీలం రూమ్‌మేట్స్ ద్వారా ఆమె కుటుంబానికి సమాచారం అందించామని ఆమె బంధువు సంజయ్ కదమ్ తెలిపారు.నీలం బ్రెయిన్‌కు ఆపరేషన్ చేసేందుకు గాను ఆసుపత్రి అధికారులు మా అనుమతి తీసుకున్నారని.ప్రస్తుతం ఆమె కోమాలో ఉందని సంజయ్ చెప్పారు.
నీలంకు సహాయం చేయాల్సిందిగా అమెరికాలోని భారతీయ విద్యార్ధులు తనను సంప్రదించారని ఎంపీ సుప్రియా సూలే తెలిపారు.తాను వ్యక్తిగతంగా నీలం కుటుంబ సభ్యులతో సంప్రదించకపోయినా, స్థానికంగా భరోసా ఇప్పించానని సుప్రియ వెల్లడించారు.
అధికారులు ఆ కుటుంబానికి సహాయం చేస్తారని సుప్రియ సూలే ఆశాభావం వ్యక్తం చేశారు.మాకు రాజకీయపరమైన విభేదాలు ఉండొచ్చు కానీ జైశంకర్ ఏ విద్యార్ధికైనా అండగా నిలబడతారని సుప్రియ చెప్పారు.