హిందువుల పర్వదినం మహాశివరాత్రిని భారత్‌తో( Mahashivratri with India ) పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఘనంగా జరుపుకున్నారు.మంగళవారం అర్ధరాత్రి నుంచే ఆలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి.
లింగోద్భోవం, జాగరణ, ఉపవాసం, శివపార్వతుల కళ్యాణం వంటి కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు.శివరాత్రి సందర్భంగా దేశంలోని అన్ని శివాలయాలు కిటకిటలాడాయి.
ప్రస్తుతం భారతీయ పండుగలు మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోనూ ఒకేసారి జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయులు మన పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు.
విదేశీయులు కూడా మన పర్వదినాల్లో విశేషంగా పాల్గొంటున్నారు.
తాజాగా మహాశివరాత్రిని కూడా భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఘనంగా నిర్వహించుకున్నారు.
గల్ఫ్ దేశాల్లో ( Gulf countries )స్థిరపడిన ప్రవాస భారతీయులు మహా శివరాత్రిని జరుపుకున్నారు.అబుదాబీలోని బీఏపీఎస్ హిందూ మందిర్‌కు( BAPS Hindu Mandir in Abu Dhabi ) బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూకట్టారు.
హరహర మహాదేవ శంభో శంకర నినాదాలతో ఆలయం మారుమోగింది.ఆలయంలో రుద్రాభిషేకం చేయడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే తరలిరావడం ప్రారంభించారు.కొందరు భక్తులు మాత్రం తమ ఇళ్ల వద్దే పూజలు, రుద్రాభిషేకం నిర్వహించారు.

బుర్ దుబాయ్‌లోని కృష్ణ మందిర్, దుబాయ్‌లోని జెబెల్ అలీలోని ( Krishna Mandir in Bur Dubai, Jebel Ali, Dubai )హిందూ దేవాలయానికి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు.ఉపవాసం విరమించిన తర్వాత సాయంత్రం వేళల్లో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారని పలువురు ప్రవాస భారతీయులు చెబుతున్నారు.మస్కట్‌లోని గల్ఫ్ ప్రాంతంలో పురాతన హిందూ దేవాలయం అయిన శివ మందిర్ (మోతీశ్వర్ మందిర్) వద్ద భారీ జనసమూహం కనిపించింది.
భక్తుల రద్దీ దృష్ట్యా పార్కింగ్ కోసం స్థానిక పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

బహ్రెయిన్‌లోని శ్రీకృష్ణ ఆలయంలోనూ శివరాత్రి సందర్భంగా ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహంచారు.ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హిందువులు తరలివచ్చారు.తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు కూడా ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
శివరాత్రి వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.