ముఖ్యంగా చెప్పాలంటే మన పూర్వికుల నుంచి పుదీనా( Spearmint ) ను వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తూ వస్తున్నారు.ఇది రుచికి రుచి సువాసనకి సువాసన రెండిటిని కూడా కలిగి ఉంటుందని చాలా మందికి తెలుసు.
పుదీనా వివిధ వ్యాధులను కూడా నయం చేయడానికి వంటకలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.పుదీనా ఆకులు వేడి వాతావరణం లో మీ శరీరాన్ని చాలా చల్లగా ఉండేల చేస్తాయి.
పుదీనా ఆకులను ( Mint Leaves )నమలాడం వల్ల నోటిలో ఉండేటువంటి దుర్వాసన దూరమైపోతుంది.అంతే కాకుండా దంతాలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
మరి పుదీనా వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనా ఆకుల రసం నొప్పి నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది.ఏదైనా సందర్భంలో తలనొప్పి వచ్చినప్పుడు పుదీనా టీ( Mint Tea ) తాగడం లేదా ఆకులను నమిలితే తల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.పుదీనా ఆకుల పేస్ట్ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఎంతగానో పని చేస్తుంది.
పుదీనా ఆకులలో ఉన్నటువంటి అమ్మినోయాసిడ్, పొటాషియం, జింక్ వంటివి చర్మాన్ని తేమగా, మృదువుగా ఉండెల చేస్తాయి.పుదీనా ప్యాక్ వల్ల చర్మం మీద మొటిమలు కూడా తగ్గడమే కాకుండా చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
అలాగే జలుబు, దగ్గు తో ఇబ్బంది పడేవారు పుదీనా ఆకులను తినడం ఎంతో మంచిది.

పుదీనా ఆకులను మరిగించి ఆ నీటితో స్నానం చేయడం వల్ల బ్యాక్టీరియా దుర్వాసన దూరమైపోతాయి.అలాగే దురదను కూడా తగ్గించడానికి ఈ పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుంది.జీర్ణక్రియను బలోపేతం చేయడానికి కూడా పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుంది.
జుట్టూ రాలిపోతుంటే రెండు మూడు రోజుల పాటు పుదీనా ఆకులను బాగా నూరి తలకు పట్టించడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.పుదీనా ఆయిల్ తో మసాజ్ చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.