టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని( Natural Star Nani ) గురించి మనందరికీ తెలిసిందే.నాని చివరగా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.
భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాతో మరో సక్సెస్ ను అందుకున్నారు నాని.
ఒకవైపు హీరోగా రాణిస్తూనే మరొకవైపు నిర్మాతగా కూడా వరుసగా సక్సెస్ లు అందుకుంటున్న విషయం తెలిసిందే.నిర్మాతగా కూడా నాని సక్సెస్ గురించి చెప్పాల్సిన పని లేదు.
వాల్ పోస్టర్( Wall Poster ) సంస్థను స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా చూడలేదు హీరో నాని.మొదట డీఫర్ దోపిడీ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు నాని.

ఆ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించాడు.ఆ సినిమా మంచి విజయం సాధించింది.అటుపై ఐదేళ్ల గ్యాప్ అనంతరం వాల్ పోస్టర్ పై అ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.కంటెంట్ బేస్డ్ చిత్రానికి మంచి పేరు వచ్చింది.అయితే కమర్శియల్ గా భారీ లాభాలు తీసుకురాలేదని గానీ నిర్మాతగా మాత్రం నానికి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చింది.అదే సినిమాతో ప్రశాంత్ వర్మ అనే ట్యాలెంట్ కుర్రాడు బయటకు రాగలిగాడు.
అటుపై హిట్ ది ఫస్ట్ కేసు( Hit The First Case ) అంటే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.వాల్ పోస్టర్ సంస్తకు ఈ సినిమా మంచి లాభాలు తెచ్చి పెట్టింది.
దీంతో ఆ ప్రాంచైజీని కొనసాగించి ఒక బ్రాండ్ లా మార్చేసాడు నాని.అలాగే మూడేళ్ల క్రితం విడుదల అయినా హిట్ ది సెకండ్ కేస్ అనే సినిమా కూడా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

అలాగే భారీగా కలెక్షన్స్ను సాధించింది.ఇక ఇటీవల నాని నిర్మాతగా వ్యవహరించిన కోర్టు మూవీ( Court Movie ) కూడా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించింది.వాల్ పోస్టర్ సంస్థలో ఇదే భారీ వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డు కూడా సృష్టించింది.ప్రస్తుతం నాని హిట్ థర్డ్ కేసు సినిమాలో హీరోగా నటిస్తూనే నిర్మాతగానూ పని చేస్తున్నాడు.
దీంతో నాని నిర్మాతగా డబుల్ హ్యాట్రిక్ నమోదు చేయడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.హిట్ ది థర్డ్ కేస్( Hit The Third Case ) కూడా విజయం సాధిస్తే నిర్మాతగా నాని ఖాతాలో డబుల్ హ్యాట్రిక్ నమోదవుతుంది.
హీరోగా సక్సెస్ పుల్ కెరీర్ ని చూస్తోన్న నాని ఖాతాలో ఇదో కొత్త రికార్డు అవుతుంది.మీడియం రేంజ్ హీరోల్లో ఇలాంటి అటెంప్ట్ లు ఎవరూ చేయలేదు.
స్టార్ హీరోల్లో కూడా ఇలా సక్సెస్ అయింది ఎవరూ లేరు.ఆ రకంగా నేచురల్ స్టార్ ఈ సినిమాల మద్యలోనే మీట్ క్యూట్ సిరీస్ ను కూడా నిర్మించాడు.
అయితే అది ఓటీటీ రిలీజ్ గానే పరిగణించాలి.మరి నాని ఇప్పుడు నిర్మాతగా డబుల్ హ్యాట్రిక్ ని అందుకుంటారేమో చూడాలి మరి.